బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పరిచయం అవసరం లేని పేరు బెల్లంకొండ సురేష్ నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక ఈయన వారసుడిగా సాయి శ్రీనివాస్ అల్లుడు శీను సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది అయితే ఆ తర్వాత సాయి శ్రీనివాస్ నటించిన సినిమాలు ఏవి పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయాయి. ఇక ఈయన తెలుగులో అల్లుడు అదుర్స్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా తర్వాత తెలుగులో ఎలాంటి సినిమాలను చేయలేదు అయితే తెలుగులో పెద్దగా సక్సెస్ సాధించలేకపోయిన బాలీవుడ్ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే చత్రపతి సినిమాని రీమేక్ చేశారు..రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా తెలుగులో ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ఇక ఇదే సినిమాని సాయి శ్రీనివాస్ వివి వినాయక్ దర్శకత్వంలో హిందీలో రీమేక్ చేశారు. ఈ సినిమా మే 12వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సాయి శ్రీనివాస్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన తన సినీ కెరియర్ గురించి పలు విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ తన తండ్రి నిర్మాత కావడంతో తను ఇండస్ట్రీలోకి రావడానికి చాలా సులభమైందని చెప్పారు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఎంత కష్టపడ్డాను అనే విషయం తనకు మాత్రమే తెలుసు అని తెలిపారు. ఇక తాను నటించిన మొదటి సినిమాకి నాన్న నిర్మాతగా వ్యవహరించారు.
ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది అయితే అప్పటికే తమకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు.నాన్న డిస్ట్రిబ్యూట్ చేసిన ఎనిమిది సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని ఆ ఒత్తిడి తనపై ఉండడంతో తర్వాత ఎలాంటి సినిమాలకు తాను ఒప్పుకోకుండా ఏడాదిన్నర పాటు ఇంటికి పరిమితమయ్యానని ఈ సందర్భంగా సాయి శ్రీనివాస్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!
గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?