దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి కంక్లూజన్ విడుదలైన తొలి రోజు నుంచే రికార్డుల వేట మొదలెట్టింది. 21 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1502 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం అదే ఉత్సాహంతో దూసుకుపోతోంది. ఈ మూవీ ఖాతాలో ఇది ఒకటే కాదు.. ఎన్నో రికార్డులు ఉన్నాయి. వాటిలో ప్రధానమైన కొన్ని….
01 . అడ్వాన్స్ టికెట్ బుకింగ్‘బాహుబలి 2’ అడ్వాన్స్ టికెట్ బుకింగ్ ద్వారా 36 కోట్లు వసూలు చేసింది. ఈ విషయంలో ‘దంగల్’ ( 18 కోట్లు) రికార్డును బద్దలుకొట్టింది.
02 . అత్యధిక థియేటర్స్ ఇండియాలో అత్యధిక థియేటర్లలో (6500) విడుదలైన తొలి చిత్రం బాహుబలి 2 . గతంలో ‘సుల్తాన్’ 4350 థియేటర్లలో రిలీజ్ అయి సంచలనం సృష్టించి. ఆ రికార్డుని బాహుబలి తుడిచి పెట్టింది.
03 . ఫస్ట్ డే తొలిరోజు కలక్షన్ల విషయంలో తన రికార్డును తానే బద్దలుకొట్టింది. బాహుబలి బిగినింగ్ ఫస్ట్ డే 50 కోట్లు వసూలు చేయగా.. బాహుబలి కంక్లూజన్ 121 కోట్లు రాబట్టి ఔరా అనిపించింది.
04 . ప్రీమియర్ షో (అమెరికా) కలక్షన్స్ విడుదలకు ముందు అమెరికాలో ప్రీమియర్ షో ల ద్వారా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రం బాహుబలి 2 . అక్కడ కేవలం ప్రీమియర్ సోలద్వారా 2.5 మిలియన్ డాలర్లు రాబట్టింది.
05 . సెకండ్ డే ఇండియాలో రెండో రోజు వసూళ్ల విషయంలోనూ అగ్రస్థానం బాహుబలిదే. రెండో రోజు 102 కోట్లు సాధించింది.
06 . 200 కోట్ల మార్క్అత్యంత వేగంగా 200 కోట్లు సాధించిన భారతీయ చిత్రం ఇదే. రెండు రోజుల్లోనే ఈ ఘనత సాధించి ‘సుల్తాన్’ (ఏడు రోజులు) రికార్డును అధిగమించేసింది.
07 . 1000 కోట్లు (వరల్డ్ వైడ్ )‘బాహుబలి 2’ వెయ్యికోట్ల రూపాయల మైలురాయిని పదిరోజుల్లోనే చేరింది. ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల వసూళ్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగా చరిత్రకెక్కింది.
08 . 1000 కోట్లు (ఓన్లీ ఇండియా )కేవలం భారత్ లోనే 14 రోజుల్లో వెయ్యి కోట్ల వసూళ్లు సాధించిన సినిమాగా బాహుబలి 2 చరిత్ర సృష్టించింది.
09 . హిందీ వెర్షన్ బాహుబలి పార్ట్ 2 హిందీ వెర్షన్ ఇప్పటి వరకు 460 కోట్లు కొల్లగొట్టింది. సల్మాన్ ఖాన్ నటించిన దంగల్ 387.28 కోట్లు రాబట్టి అత్యధిక కలక్షన్ సాధించిన హిందీ సినిమాగా రికార్డ్ నమోదు చేసింది. ఆ రికార్డును డబ్బింగ్ మూవీ బద్దలు కొట్టింది.
10 . ఓవర్సీస్ కలక్షన్స్ అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రం బాహుబలి కంక్లూజన్. ఆరు రోజుల్లోనే అక్కడ 12.6 మిలియన్ డాలర్లు సాధించింది. ఓవర్సీస్ మొత్తంలో 20 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.
11 . కోలీవుడ్ @ 100తమిళ వెర్షన్ లో బాహుబలి కంక్లూజన్ వంద కోట్లను వసూలు చేసింది. డబ్బింగ్ మూవీ తమిళనాడులో వంద కోట్లు సాధించడం ఇదే మొదటి సారి.
12 . టాలీవుడ్ @177తెలుగు రెండు రాష్ట్రాల్లో మూడు వారాలకు 177 కోట్లు కొల్లగొట్టింది. ఖైదీ నంబర్ 150 అన్ని ప్రాంతాల్లో కలుపుకొని 164 కోట్లు వసూలు చేసింది. ఆ విధంగా కూడా బాహుబలి నంబర్ వన్ అయింది.