సినిమా చూస్తే డబ్బులు ఇస్తారా… ఛ ఊరుకోండి. అప్పుడెప్పుడో హారర్ సినిమా చూస్తే ఇలా డబ్బులిస్తామని అన్నారని విన్నాం అని అంటారా! ఆగండాగండి… ఇప్పుడు ఈ కొత్త ఆఫర్ కూడా ఆ హారర్ సినిమాల గురించే. అవును ఒక్కో హారర్ సినిమా చూస్తే 100 డాలర్లు ఇవ్వడానికి ఒక సంస్థ ముందుకొచ్చింది. ఇంతకీ ఏంటా సినిమాలు? ఎందుకిస్తారు? అనే వివరాలు మీ కోసం. అమెరికాకు చెందిన ఫినాన్స్ బజ్ అనే సంస్థ… భారీ బడ్జెట్‌తో తీసిన భయానక చిత్రాలకు ఆదరణ లభిస్తుందా?
తక్కువ వ్యయంతో రూపొందిన ఉత్కంఠభరిత సినిమాలకు ఆదరణ ఉంటుందా? అనే సర్వే నిర్వహించనుంది. ఇందులో భాగంగా ‘హారర్ మూవీ హార్ట్‌రేట్ అనలిస్ట్’ కోసం ఓ పరీక్ష పెట్టనుంది. దీని కోసం 13 హారర్ చిత్రాల్ని ఎంపిక చేసింది. ఈ పోటీలో పాల్గొనేవారు ఫిట్‌బిట్ ధరించి ఈ సినిమాలు చూడాలి. ఈ హారర్ చిత్రాల్ని చూసి ధైర్యంగా ఉన్నవారికి ఫినాన్స్ బజ్ 1300 డాలర్లు ( మన కరెన్నీ ప్రకారం ₹95,500) వరకు ఇస్తారట.
అయితే ఇది అమెరికా పౌరులకి మాత్రమే ఉంది. ఆ సినిమాల జాబితాలో… సా, అమిటివిల్లే హారర్, ఏ క్వైట్ ప్లేస్, ఏ క్వైట్ ప్లేస్ పార్ట్ 2, క్యాండిమ్యాన్, ఇన్సిడియోస్, ది బ్లెయిర్ విచ్ ప్రొజెక్ట్, సినిస్టర్, గెట్‌ఔట్, ది పర్గ్, హాలోవీన్ , పారానార్మల్ యాక్టివిటీ, అనబెల్లె ఉన్నాయి.
Most Recommended Video
టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!