ఓ తమిళ డబ్బింగ్ సినిమాను తెలుగులో రీరిలీజ్ చేసినప్పుడు వచ్చిన స్పందన చూసి… ఆ సినిమా హీరో థ్యాంక్స్ నోట్ రాశారు. ఇదొక్కటి చాలు కదా… ఆ సినిమాకు ఎంత అభిమానం చూపించారో అర్థం చేసుకోవచ్చు. ఆ మాటకొస్తే రీరిలీజ్‌ల విషయంలో టాలీవుడ్‌ని కొట్టేవారు లేరు. కావాలంటే చూడండి.. టాలీవుడ్‌లో రీరిలీజ్‌లు అవుతున్న సినిమాలు, అవి సాధిస్తున్న రికార్డులు ఏ స్థాయిలో విజయం సాధిస్తున్నాయో. దీంతో ఇప్పుడు రీరిలీజ్‌లకు టాలీవుడ్‌కి మించిన అడ్డా లేదు అంటున్నారు.
కొత్త సినిమాలకు రికార్డులు రావడం సహజం. ఆ రికార్డులను తర్వాతి సినిమా బద్దలు కొట్టడం, ఆ తర్వాతి సినిమా మళ్లీ సాధించడం చూస్తూనే ఉన్నాం. అయితే ఎప్పుడో పదేళ్లు.. 15 ఏళ్లు.. 20 ఏళ్ల ముందు రిలీజైన సినిమాలను రీ రిలీజ్ చేసినా అదే స్థాయిలో కాకపోయినా… కొన్ని కొత్త సినిమాలకు మించి విజయం సాధిస్తున్నాయి. ఓటీటీల్లో, యూట్యూబ్‌లో ఆ సినిమా ఉన్నా థియేటర్లకు వచ్చి మరీ చూస్తున్నారు. గతేడాది మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ‘పోకిరి’ సినిమాకు పెద్ద ఎత్తున స్పెషల్ షోలు వేశారు.
ఆ తర్వాత ఇప్పటివరకు పాతిక సినిమాల వరకు రీరిలీజ్‌లు అయ్యాయి. అందులో దాదాపు అన్ని సినిమాలు మంచి విజయం సాధించాయి. అయితే ఇదంతా పెద్ద స్టార్ల సినిమాలకే అనుకోవడానికి లేదు. అలాగని గతంలో స్ట్రాంగ్ కలెక్షన్లు వసూలు చేసిన సినిమాలకే కాదు. సరైన విజయం అందుకోని సినిమాలకు కూడా ఈ జోరు కనిపించింది. రామ్‌చరణ్ సినిమాల్లో డిజాస్టర్ అని చెప్పుకునే ‘ఆరెంజ్’ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ధనుష్ ‘3’ సినిమాకు కూడా అంతే.
సరైన స్టార్ లేని ‘ఈ నగరానికి ఏమైంది’ లాంటి సినిమాకే హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఇక రీసెంట్ సినిమా అంటే… సూర్య ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’. ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసే సూర్య ఆశ్చర్యపోతూ ట్వీట్ చేశాడు. ఈ లెక్కన టాలీవుడ్‌ని (Tollywood) కొట్టేవాళ్లే లేరుగా రీరిలీజ్‌ల విషయంలో.
ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!