అదేదో సినిమాలో ఇండియా క్రికెట్ ఆడితే….పాకిస్తాన్ తో ఆడాలి కానీ…బంగ్లాదేశ్ తో ఆడితే ఏముంటుంది మజా…..అని…అలాగే మన సినిమాల్లో హీరోతో పోటీ పడి నిలబడే….ఢీ కొట్టి సవాల్ విసిరే ప్రతినాయకుడు ఉంటేనే మంచి కిక్, మన హీరో క్యారెక్టర్ కూడా భీబత్సంగా ఎలివేట్ అవుతుంది….అయితే అప్పటికీ ఇప్పటికీ కధానాయకుల పాత్రల్లోనే కాదు….ప్రతినాయకుడు పాత్రల్లోనూ చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఒకప్పుడు సూపర్ హీరోలుగా చక్రం తిప్పిన వారు ఇప్పుడు తమ సెకెండ్ ఇన్నింగ్స్ ను విలన్ పాత్రల్లో ఎంట్రీ ఇస్తున్నారు…అంటే కాదు, స్టైలిష్ గా, పవర్‌ఫుల్ గా ఇంకా చెప్పాలి అంటే కొన్ని ఫ్రేమ్స్ లో హీరోకన్నా కాస్త ఎక్కువుగా కనిపిస్తూ అలరిస్తున్నారు. మరి అలాంటి విలన్స్ పై ఒక లుక్ వేద్దాం రండి….
జగ్గు భాయ్ – నాన్నకు ప్రేమతో….సాఫ్ట్ హీరోగా అలరించిన జగపతి బాబు, లెజెండ్ సినిమాతో జగ్గు భాయ్ గా మారి….ఇప్పుడు స్టైలిష్ విలన్ గానే కాకుండా, సౌత్ ఇండియా లోనే టాప్ విలన్స్ లో ఒకడిగా అరాచకం సృష్టిస్తున్నాడు…ఈ ఏడాది నాన్నకు ప్రేమతోలో స్టైలిష్, పవర్‌ఫుల్, తెలివిగల విలన్ గా అలరించాడు.
ఆది పినిశెట్టి…సరైనోడు…దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన ఆది….హీరోగా మంచి మార్కులు వేసుకునే క్రమంలోనే….బోయపాటి ఆహ్వానం మేరకు తొలి రోజుల్లోనే నెగేటివ్ రోల్ లో అరిపించాడు….సరైనోడు లో ఆయన పాత్ర..ఆ ఆటిట్యూడ్ సూపర్ గా సెట్ అవ్వడమే కాకుండా, సినిమా హిట్ కు మంచి అసెట్ గా నిలిచాయి.
సూరియా – 24తమిళ టాప్ హీరో సూరియ…హీరోగానే కాకుండా విలన్ గా కూడా అలరించాడు…తన 24సినిమాలో తానే తనను ఢీ కొట్టే సరికొత్త పాత్రలో అలరించి, అందరినీ తన యాక్టింగ్ తో మురిపించాడు.
శ్రీనివాస్ అవసరాల – జెంటిల్ మ్యాన్టాలీవుడ్ లో రచయితగా, దర్శకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదించుకున్న శ్రీనివాస్ అవసరాల, అదే క్రమంలో విలన్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు….నాని జెంటిల్ మ్యాన్ లో బ్ల్యాక్‌మేల్ చేసే విలన్ పాత్రలో నటించి మెప్పించాడు.
చియాన్ విక్రమ్ – ఇరుముగన్ప్రయోగాల కధలకు ప్రాణం పోస్తూ…ఎప్పటికప్పుడు డిఫరెంట్ పాత్రల్లో నటిస్తున్న విక్రమ్, అటు హీరోగానే కాకుండా, విలన్ గా కూడా అలరిస్తున్నాడు…తాజాగా తమిళంలో ఇరుముగన్ గా మెరిసిన విక్రమ్, తలుగులో ఇంకొక్కడు గా అలరించాడు…ఆ చిత్రంలో విలన్ పాత్రలో మంచి మార్కులు కొట్టేసాడు విక్రమ్.
అనసూయ భరద్వాజ్ – క్షణంచిన్న సినిమాగా విడుదలయ్యి మంచి హిట్ అందుకున్న సినిమా క్షణం. బుల్లి తెరపై యాంకర్ గా మంచి పేరు సంపాదించుకున్న అనసూయ ఈ సినిమాలో విలన్ పాత్రలో మెరిసి మెప్పించింది.
బాబా సైగల్ – సాహసం శ్వాసగా సాగిపోటాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ తన పాటలతో హుషారు ఎత్తించే బాబా సైగల్…నాగ చైతన్య సాహసం శ్వాసగా సాగిపో సినిమాలో విలన్ పోలీసుగా అలరించాడు.
ఆరవింద్ స్వామి – ధృవఒకప్పుడు మంచి హీరోగా ఎన్నో సినిమాలు చేసిన ఆరవింద్ స్వామి, విలన్ గా మారిన సినిమా తమిళ ‘తని ఒరువన్’. అయితే ఆ సినిమా అక్కడ సూపర్ హిట్ కావడం, అదే క్రమంలో ఈ సినిమాలో విలన్ పాత్ర మంచి డిమాండ్ పాత్ర కావడంతో తెలుగులో చెర్రీ హీరోగా రీమేక్ అయిన ధృవలో సైతం ఆరవింద్ స్వామినే తీసుకున్నారు…అయితే ఈ సినిమాలో స్టైలిష్ విలన్ గా ఆరవింద్ స్వామి నటన అమోఘం అనే చెప్పాలి.