#BFF వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

వినోదాత్మకమైన, వినూత్నమైన కంటెంట్ ను ప్రేక్షకులకు అందించడంలో ‘ఆహా’ ఓటిటి.. వందకి వంద మార్కులు వేయించుకుంది. ప్రతీ వారం ఓ కొత్త సినిమా లేదా వెబ్ సిరీస్ లను ప్రేక్షకులకు అందిస్తూ మంచి ఫీస్ట్ ఇస్తుంది. మరోపక్క యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న డిజిటల్ సంస్థగా ‘తమడా మీడియా’ దూసుకుపోతుంది. తమడా వారి యూట్యూబ్ ఛానల్స్ కు మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇక వీరిద్దరి కలయికలో రూపొందిన తాజా వెబ్ సిరీస్ ‘#BFF’.’బిగ్‌బాస్5′ ఫేమ్ సిరి హనుమంతు, నటి రమ్య పసుపులేటి, ప్రముఖ జర్నలిస్ట్ అంజలి వంటి వారు ఇందులో ప్రధాన పాత్రలు పోషించడంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది. నిన్న అంటే మే 20న ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యింది. అది ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో ఓ లుక్కేద్దాం రండి :

కథ : నిత్య (సిరి హనుమంతు) తార (రమ్య పసుపులేటి) ఇద్దరు ఒకే ప్లాట్లో ఉంటారు. వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం, వీరి అలవాట్లు, వీరి అమాయకత్వం.. వీళ్ళ కెరీర్ లో ఎదురైన ఛాలెంజ్,వీరి మధ్య ఏర్పడిన వైరం, వీళ్ళు తీసుకున్న స్ట్రేంజ్ నిర్ణయాలు వంటి వాటిని ఈ సిరీస్ లో ఐదు ఎపిసోడ్స్ గా చూపించారు. ‘అయ్యయో జేబులు ఖాళీ ఆయనే’, ‘అమ్మ మేము హైదరాబాద్’, ‘ఒట్టు తీసి గట్టుమీద పెట్టు’, ‘బాస్ బాదితులు’.. ఇలాంటి పేర్లతో ఈ 5 ఎపిసోడ్స్ ను చూపించారు.

నటీనటుల పనితీరు : సిరి హనుమంత్ అమాయకపు నటన ఆమె బ్యూటిఫుల్ లుక్స్ బాగున్నాయి. రమ్య పసుపులేటి కూడా తన లుక్స్ తో అలాగే నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.వీళ్ళిద్దరూ నిత్య, తార పాత్రలకి టైలర్ మేడ్ అనిపించారు. తల్లి పాత్రలో నటించిన యాంకర్ అంజలి.. ‘ఈమెలో ఇంత మంచి నటి ఉందా?’ అనే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. చాలా ఈజ్ తో ఆమె ఈ పాత్రని పోషించింది.అంజలి, ప్రణీత పట్నాయక్ కూడా కొంతలో కొంత హైలెట్ గా నిలుస్తారు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే పెర్ఫార్మ్ చేశారు.

సాంకేతిక నిపుణుల పనితీరు : భార్గవ్ మాచర్ల ‘అడల్టింగ్’ ని ఎంతో ఓన్ చేసుకుని తెలుగు ప్రేక్షకులకు అర్ధమయ్యే రీతిలో దీనిని చాలా చక్కగా చెప్పాడు. అతను రాసుకున్న డైలాగులు అన్నీ యూత్ ను ఇట్టే అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా అతని సినిమాల్లో కానీ అతను తెరకెక్కించే సిరీస్ లలోని పాత్రలు చాలా సహజంగా బిహేవ్ చేస్తాయి. వాటికి ఒక చిన్న పాటి ఆటిట్యూడ్ ఉంటుంది.

ఈ ‘#BFF’ లో కూడా అదే ఫీల్ ను క్యారీ చేసాడు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సిరీస్ కు రిచ్ నెస్ ను తీసుకొచ్చాయి. నరేన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ప్రతీ సీన్ మూడ్ ను అర్థం చేసుకుని.. బాగా ఫీల్ అయ్యి.. అతను కంపోజ్ చేసినట్టు స్పష్టమవుతుంది. నిర్మాణ విలువల విషయంలో డైస్ క్రియేషన్స్, తమడా మీడియా, ఆహా.. వారు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు అనిపిస్తుంది.

విశ్లేషణ : ‘అడల్టింగ్’ ను అడాప్ట్ చేసుకుని ప్రజెంట్ చేసిన విధానానికి భార్గవ్ మాచర్లని మెచ్చుకోవాలి.సినిమా సినిమాకి దర్శకుడిగా అతను ఇంప్రూవ్ అవుతున్నాడు. ‘అడల్టింగ్’ చూసిన వాళ్ళకి కూడా ఈ సిరీస్ బాగా నచ్చే విధంగా ఉంది అనడంలో సందేహం లేదు. ఓవరాల్ గా ‘#BFF’ ప్రతీ ఒక్కరికీ మంచి టైం పాస్ ను అందించే సిరీస్. ఈ వీకెండ్ కు ఆహా’ లో హ్యాపీగా చూసెయ్యొచ్చు.

రేటింగ్ : 3.5/5

Share.