ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు అర్జీత్ సింగ్ (Arijit Singh) అరుదైన ఘనత అందుకున్నారు. మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ స్పాటిఫైలో ఆమె ఈ గౌరవం దక్కించుకున్నాడు. స్పాటిఫైలో 151 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకుని సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఈ క్రమంలో ప్రపంచ ప్రఖ్యాత సంగీత ప్రముఖులు టేలర్ స్విఫ్ట్, ఎడ్ షీరన్‌ను దాటుకుని టాప్‌లో నిలిచాడు.
ఈ మేరకు ఈ వారం స్పాటిఫై సంగీతకారుల జాబితాలో పేర్కొన్నారు. పాప్ మ్యూజిక్ సర్క్యూట్‌లో పాపులర్ అమెరికన్ గాయని స్విఫ్ట్ 139.6 మిలియన్ల మంది ఫాలోవర్లతో ఉన్నారు. ఇక రెండో స్థానంలో 121 మిలియన్ల అభిమానులతో బ్రిటన్‌కు చెందిన ఎడ్ షీరాన్ ఉన్నాడు. ఇక ఈ జాబితాలో ఇతర భారతీయుల్ని చూస్తే.. ఏఆర్ రెహమన్ (65.6 మిలియన్ల ఫాలోవర్లు) 14వ స్థానంలో నిలిచారు., 53.4 మిలియన్లతో ప్రీతమ్ 21వ స్థానంలో ఉండగా.. నేహా కక్కర్ 48.5 మిలియన్ల మందితో 25వ స్థానంలో నిలిచారు.
దివంగత సంగీత దిగ్గజాలు లతా మంగేష్కర్, కిశోర్ కుమార్ కూడా ఈ లిస్ట్‌లో ఉన్నారు. 22 మిలియన్లతో 100వ స్థానంలో లతాజీ ఉండగా, కిశోర్ కుమార్ 16 మిలియన్ల ఫాలోవర్లతో 144వ స్థానంలో నిలిచారు. ఇక అర్జీత్ సింగ్ (Arijit Singh) సంగతి చూస్తే.. భారతీయ సినీ సంగీత పరిశ్రమలో ఆయన అనూహ్యంగా వచ్చారు అని చెప్పాలి. 2005లో ‘ఫేమ్ గురుకుల్’ అనే రియాలిటీ షోలో పోటీదారుడిగా ఆయన సంగీత ప్రయాణం మొదలైంది.
అక్కడికి 8 సంవత్సరాల తర్వాత ‘ఆషికీ 2’ సినిమాలోని ‘తుమ్ హి హో’ పాటతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఇప్పటివరకు గాయకుడి 691 పాటలు పాడగా.. అందులో తెలుగు పాటలు 25 ఉన్నాయి. తెలుగులో ఆయన పాడిన పాటలు దాదాపు అన్నీ ఛార్ట్ బస్టర్‌లే. ఇప్పటికీ హమ్ చేసుకునేవే. ఇక ఆయన సంగీత దర్శకుడిగా 27 పాటలకు స్వరాలందించారు.