సిద్ధార్థ్ (Siddharth) ఒకప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు. తర్వాత దాదాపు 8 ఏళ్ళ పాటు ఒక్క స్ట్రైట్ మూవీ కూడా చేయలేదు. డబ్బింగ్ సినిమాలతోనే పలకరిస్తూ వచ్చాడు. ‘మహాసముద్రం’ తో కంబ్యాక్ ఇచ్చినా అది వర్కౌట్ కాలేదు. దీంతో మళ్ళీ తమిళంలోనే సినిమాలు చేస్తూ వచ్చాడు. అవి తెలుగులోకి కూడా డబ్ అవుతున్నాయి. ‘చిన్నా’ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ కలెక్షన్స్ రాలేదు. ఇప్పుడు ‘3 BHK‘ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శరత్ కుమార్ (Sarathkumar), దేవయాని (Devayani) వంటి స్టార్స్ నటించడంతో ఈ సినిమాపై క్రేజ్ ఏర్పడింది.
జూలై 4న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే పర్వాలేదు అనిపించే టాక్ తెచ్చుకుంది. కానీ ఓపెనింగ్స్ సో సో గానే వచ్చాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే:
నైజాం | 0.12 cr |
సీడెడ్ | 0.03 cr |
ఆంధ్ర(టోటల్) | 0.12 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 0.27 cr (షేర్) |