Bhaag Saale Twitter Review: ‘భాగ్ సాలే’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది… ఎలా ఉందంటే?

కీరవాణి తనయుడు శ్రీసింహా కోడూరి హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘భాగ్ సాలే’. నేహా సోలంకి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకుడు. ‘వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్’ నిర్మాతగా.. ‘బిగ్ బెన్’, ‘సినీ వ్యాలీ’ మూవీస్ అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 7న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. అంటే మరికొన్ని గంటల్లో అనమాట.

ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన వాళ్ళు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వారి టాక్ ప్రకారం.. సినిమా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో రూపొందింది అని… కాకపోతే అసలు కథలోకి వెళ్ళడానికి ఎక్కువ టైం పట్టిందని.. ఈ గ్యాప్ లో వచ్చే సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయని వారు అంటున్నారు. అయితే సెకండ్ హాఫ్ లో వచ్చే కామెడీ సన్నివేశాలు బాగానే ఉంటాయని.. క్లైమాక్స్ మాత్రం కొత్తగా లేదని అంటున్నారు.

క్రైమ్ కామెడీ సినిమాలు చూసేవారికి ఈ సినిమా (Bhaag Saale) నచ్చే అవకాశాలు ఉంటాయని..మిగిలిన వాళ్లకు యావరేజ్ అనిపించొచ్చు అని సినిమా చూసిన ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. మరి మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus