భాగమతి మూవీ ట్రైలర్ | అనుష్క

టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ వండర్ బాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న అనుష్క నటించిన తాజా తెలుగు చిత్రం భాగమతి. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి చిత్రాల్లో అనుష్క నటించిన తీరు అందర్నీ అబ్బురపరిచింది. ఇదే తరహాలో… భాగమతిగా అనుష్క తన పెర్ ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేయనుంది. ఇటీవలే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. అనుష్క గెటప్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అన్నంతగా క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 26న భాగమతి చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. బంపర్ హిట్ చిత్రాల్ని నిర్మించి… రెబల్ స్టార్ ప్రభాస్ తో నాలుగు భాషల్లో సాహో వంటి ప్రెస్టీజియస్ చిత్రాన్ని నిర్మిస్తున్న యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ భాగమతి చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. పిల్ల జమీందార్ వంటి సూపర్ హిట్ ఫిల్మ్ అందించిన అశోక్ ఈ చిత్రానికి దర్శకుడు.

Read Today's Latest Trailers Update. Get Filmy News LIVE Updates on FilmyFocus