భగవంత్ కేసరి ప్రమోషన్స్ వేరే లెవెల్.. థమన్ మోత మోగించనున్నారా?

బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భగవంత్ కేసరి సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడగా ఈరోజు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ప్రోమోకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు సాయంత్రం 5 గంటల 6 నిమిషాలకు రిలీజ్ కానున్న గణేష్ యాంతం సాంగ్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య సినిమాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టే థమన్ ఈ సినిమాలో ప్రతి సాంగ్ స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేశారని తెలుస్తోంది.

గణేష్ యాంతం సాంగ్ ను తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ గణేష్ టెంపుల్స్ లో లాంఛ్ చేయనున్నారు. ఒక సాంగ్ ను ఈ విధంగా టెంపుల్స్ లో లాంఛ్ చేయడం భగవంత్ కేసరి విషయంలో మాత్రమే జరిగిందని ఇది బాలయ్య మూవీకి దక్కిన అరుదైన రికార్డ్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. భగవంత్ కేసరి ప్రమోషన్స్ వేరే లెవెల్ లో జరుగుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.

థమన్ ఈ సినిమాతో మరోసారి మోత మోగించనున్నారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వినాయక చవితి పండుగ సమయంలో ప్రతి గణేష్ మండపంలో ఈ గణేష్ యాంతం వినిపిస్తుందని బాలయ్య ఫ్యాన్స్ కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. 90 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో భగవంత్ కేసరి తెరకెక్కగా ఈ సినిమాకు బిజినెస్ భారీ రేంజ్ లో జరిగిందని తెలుస్తోంది.

రిలీజ్ కు ముందే భారీ లాభాలను భగవంత్ కేసరి మూవీ సొంతం చేసుకోగా మాస్ ప్రేక్షకులతో పాటు క్లాస్ ప్రేక్షకులను సైతం మెప్పించేలా అనిల్ రావిపూడి ఈ సినిమాను ప్లాన్ చేశారు. అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus