Bhagavanth Kesari: భగవంత్ కేసరి మూవీ డైలాగ్ లీక్.. గూస్ బంప్స్ వచ్చేలా ఉందంటూ?

బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమా తాజాగా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. అక్టోబర్ నెల 19వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి గత నెలలో విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అనిల్ రావిపూడి ఎంటర్టైన్మెంట్ తో పాటు బాలయ్య మాస్ డైలాగ్స్ ఈ సినిమాలో ఉండనున్నాయని తెలుస్తోంది.

తాజాగా భగవంత్ కేసరి సినిమా నుంచి డైలాగ్ లీక్ కాగా ఈ డైలాగ్ భలే ఉందంటూ ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. “ఊర్లో ఉన్న కుక్కలు ఉర్లోనే మొరగాలి.. అడవిలో మొరిగితే సింహం ఊరుకుంటుందా..? గర్జిస్తుంది..? ఆ అడవి బిడ్డే భగవంత్ కేసరి” అనే డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ డైలాగ్ భగవంత్ కేసరి సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచుతోంది.

భగవంత్ కేసరి (Bhagavanth Kesari) సినిమాలో కాజల్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలయ్య కూతురిగా శ్రీలీల నటిస్తున్నారని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. భగవంత్ కేసరి సినిమా దసరా విజేతగా నిలవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య గత సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన నేపథ్యంలో ఈ సినిమా కూడా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

బాలయ్య ఈ మధ్య కాలంలో వరుసగా డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నారని కామెంట్లు వినిపిస్తుండగా ఈ సినిమాలో మాత్రం సింగిల్ రోల్ లో కనిపించనున్నారు. ఈ సినిమా విడుదలైన తర్వాత బాలయ్య బాబీ డైరెక్షన్ లో సినిమాతో బిజీ కానున్నారు. 2024 ఎన్నికల లోపు బాబీ సినిమా కూడా షూటింగ్ ను పూర్తి చేసుకుని థియేటర్లలో విడుదల కానుంది. బాలయ్య మాస్ సినిమాలతో పాటు క్లాస్ సినిమాలతో సైతం సత్తా చాటాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus