నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందిన మాస్ అండ్ ఎమోషనల్ మూవీ ‘భగవంత్ కేసరి’. ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ నటించగా బాలకృష్ణ కూతురిగా అతి కీలకమైన పాత్రలో శ్రీలీల నటించింది. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది..లు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. టీజర్, ట్రైలర్..వంటివి సినిమా పై ఉన్న అంచనాలు పెంచాయి. తమన్ సంగీతంలో రూపొందిన పాటలు సో సో గా అనిపించాయి.
2023 అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ మంచి వసూళ్లు సాధించింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 19.75 cr |
సీడెడ్ | 13.00 cr |
ఉత్తరాంధ్ర | 6.50 cr |
ఈస్ట్ | 3.60 cr |
వెస్ట్ | 2.95 cr |
గుంటూరు | 5.56 cr |
కృష్ణా | 2.70 cr |
నెల్లూరు | 2.80 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 56.86 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 5.80 cr |
ఓవర్సీస్ | 7.35 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 70.01 cr (షేర్) |
‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari)చిత్రానికి రూ.60.01 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.61 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ‘భగవంత్ కేసరి’ చిత్రం రూ.70.01(కరెక్టెడ్) కోట్ల షేర్ ను రాబట్టి… బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.9.01 కోట్ల ప్రాఫిట్స్ ను అందించింది.
గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!
హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!