Bhagavanth Kesari: ఆ విషయంలో మాత్రం ఫీలవుతున్న బాలయ్య ఫ్యాన్స్.. ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలయ్యకు ప్రస్తుతం శుక్ర మహాదశ నడుస్తోంది. బాలయ్య ఏ సినిమాలో నటించినా ఆ మూవీ సక్సెస్ సాధిస్తూ మంచి లాభాలను అందిస్తోంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా బాలయ్య భగవంత్ కేసరి స్ట్రీమింగ్ అవుతోంది. భగవంత్ కేసరి హిందీ వెర్షన్ కు కూడా బాలయ్య ఓన్ డబ్బింగ్ చెప్పుకున్నారు. భగవంత్ కేసరి హిందీ వెర్షన్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండటం గమనార్హం. అయితే భగవంత్ కేసరి హిందీ వెర్షన్ ను థియేటర్లలో రిలీజ్ చేసి ఉంటే బాగుండేదని కొంతమంది ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ఈ విషయంలో మాత్రం కొంతమంది అభిమానులు నిరాశకు గురవుతున్నారని తెలుస్తోంది. బాలయ్య వరుస విజయాలు ఇచ్చిన ఊపుతో కొత్త సినిమాల ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఆ సినిమాలు కచ్చితంగా సక్సెస్ సాధించడానికి ఎంతో కష్టపడుతున్నారని తెలుస్తోంది. బాలయ్య ఏ రంగంలో అడుగుపెట్టిన పాజిటివ్ ఫలితాలను అందుకున్నారు. సీడెడ్ లో బాలయ్య ఖాతాలో (Bhagavanth Kesari) అరుదైన ఘనత చేరింది.

కడపలో బ్యాక్ టు బ్యాక్ కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్లను మూడు సినిమాలతో సొంతం చేసుకున్న ఏకైక హీరో బాలయ్య కావడం గమనార్హం. సీడెడ్ లో కూడా బాలయ్య గత మూడు సినిమాలు అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుని నిర్మాతలకు లాభాలను అందించాయి. బాలయ్య డబుల్ హ్యాట్రిక్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

బాబీ, బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలయ్య తర్వాత సినిమాలు తెరకెక్కనున్నాయని సమాచారం అందుతోంది. బాలయ్య పారితోషికం గత కొన్నేళ్లలో భారీ స్థాయిలో పెరిగింది. బాలయ్య రెమ్యునరేషన్ 28 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. రాబోయే రోజుల్లో బాలయ్యకు మరిన్ని విజయాలు దక్కుతాయేమో చూడాలి. బాలయ్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. బాలకృష్ణ ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించాలని అభిమానులు భావిస్తున్నారు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus