Bhagavanth Kesari: హిందీలో విడుదల కాబోతున్న భగవంత్ కేసరి!

బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈ సినిమా విడుదలయి 20 రోజులు అవుతున్నప్పటికీ ఇంకా కొన్నిచోట్ల ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది. ఇకపోతే తాజాగా చిత్ర బృందం ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా టెక్నీషియన్లకు సన్మానించి వారికి జ్ఞాపికలను అందచేశారు. ఇక ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. మంచి సన్నివేశం యాక్షన్ కలగలిపిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు. మా సినిమాకు ఇలాంటి విజయం అందించిన ప్రేక్షకులకు ప్రత్యేకంగా బాలకృష్ణ ధన్యవాదాలు తెలియజేశారు. నాకు మొద‌టి నుంచి ప్ర‌యోగాలు చేయ‌డం అల‌వాట‌ని అందుకే ఈ భ‌గ‌వంత్ కేసరి (Bhagavanth Kesari) సినిమాను హిందీలో డ‌బ్ చేసి త్వ‌ర‌లో విడుద‌ల చేస్తామ‌ని తెలిపారు.

ఇందులోని మెసేజ్ దేశ ప్రజలందరికీ చేరితే మేము చేసిన ఈ ప్రయత్నం మరింత మందికి చేరువవుతుందని బాలకృష్ణ తెలియజేశారు. ఇక హిందీ వెర్షన్ లో నా పాత్రకు నేనే మొదటిసారి డబ్బింగ్ చెప్పుకున్నానని ఈ సందర్భంగా బాలకృష్ణ తెలిపారు.. ఇప్పటి వరకు నేను చెప్పిన తెలుగు భాష డబ్బింగ్ విన్నారు. ఇక పై హిందీతో మోత మోగుద్ద‌ని అన్నారు.

నా భాషా ప‌టిమ, నా స‌త్తా ఏంటో మీరే స్వ‌యంగా చూస్తార‌ని అన్నారు. ఇదిలా ఉండగా సినిమాలో విలన్ గా చేసిన అర్జున్ రాంపాల్ బాలీవుడ్ నటుడు కావడం సినిమాకు కలిసొచ్చే అవకాశం ఉందని చెప్పాలి. ఇక తెలుగులో ఎంతో అద్భుతమైన సత్తా చాటుకున్నటువంటి ఈ సినిమా హిందీలో ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus