హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే పరిస్థితి చూస్తే ‘అందముంది.. అభినయం ఉంది.. కానీ అదృష్టమే లేదు’ అనక తప్పదు. టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి బాక్సాఫీస్ మాత్రం షాకుల మీద షాకులు ఇస్తోంది. గ్లామర్ పరంగా ఫుల్ మార్కులు కొట్టేస్తున్నా, సక్సెస్ మాత్రం ఆమడ దూరంలోనే నిలిచిపోతోంది.మొదట ‘మిస్టర్ బచ్చన్’ డిజాస్టర్‌గా మిగిలింది.
ఆ తర్వాత విజయ్ దేవరకొండతో ‘కింగ్‌డమ్’, దుల్కర్ సల్మాన్‌తో ‘కాంత’ లాంటి క్రేజీ ప్రాజెక్టులు చేసినా ఫలితం మారలేదు. కంటెంట్ ఉన్నా కలెక్షన్స్ రాక ఆ సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా దెబ్బతిన్నాయి. తాజాగా నవంబర్ 27న రామ్ పోతినేనితో కలిసి వచ్చిన ‘ఆంధ్ర రాజు తాలూకా’ పరిస్థితి చూస్తే ఎవరికైనా జాలి కలగక మానదు.ఈ సినిమాకు ఆడియెన్స్, క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

స్టోరీ బాగుందని, ఎమోషనల్ గా కనెక్ట్ అయిందని, రామ్ – ఉపేంద్ర నటన అద్భుతమని ప్రశంసలు దక్కాయి. కానీ కమర్షియల్ గా మాత్రం సినిమా కోలుకోలేని దెబ్బతింది. దాదాపు రూ.60 నుంచి రూ.70 కోట్ల భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తే.. ఇప్పటివరకు కేవలం రూ.23.1 కోట్లు మాత్రమే వసూలయ్యాయి.పాజిటివ్ టాక్ వచ్చినా, బడ్జెట్ లో సగం కూడా రికవరీ కాకపోవడం నిజంగా విచిత్రం.
దీంతో వరుసగా నాలుగో సినిమా కూడా డిజాస్టర్ ఖాతాలో పడిపోయింది. ప్రస్తుతం అఖిల్ అక్కినేనితో చేస్తున్న సినిమాపైనే అమ్మడు ఆశలన్నీ పెట్టుకుంది. కనీసం ఆ సినిమాతో అయినా భాగ్యశ్రీకి హిట్ ‘భాగ్యం’ దక్కుతుందేమో చూడాలి.
