సమకాలీన అంశాలను కథాంశాలుగా తీసుకొని చిత్రాలను తెరకెక్కించడం, రూపొందించడంలో వర్మ ఎప్పుడు ముందుతుంటారు. “రక్త చరిత్ర, 26/11, వంగవీటి” చిత్రాలు ఆ కోవలోకే వస్తాయి. ఇంకా ఈ తరహాలో సినిమాలు చాలా ఎనౌన్స్ చేసినప్పటికీ.. కొన్ని షూటింగ్ కూడా మొదలవ్వకుండానే ఆగిపోగా.. ఇంకొన్ని కనీసం సెట్స్ కూడా వెళ్లకుండా కేవలం ప్రెస్ నోట్స్ కి పరిమితం అయిపోయాయి. అయితే.. వర్మకి అదృష్టం అలా కలిసొచ్చిందో ఏమో కానీ ఆయన నిర్మాణంలో రూపొందుతున్న తాజా చిత్రం “భైరవ గీత” కథాంశం పరువు హత్య నేపధ్యంలో సాగుతుందట.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక యావత్ ప్రపంచంలో వైరల్ అయిపోయిన “ప్రణవ్” అనే కుర్రాడి పరువు హత్య ఉదంటానికి సంబంధించిన సన్నివేశాలు ఉండబోతున్నాయంట. నిజానికి “భారవ గీత” చిత్రం షూటింగ్ ప్రణవ్ హత్య కంటే ముందే ఫినిష్ అయిపోయినప్పటికీ.. కొన్ని సన్నివేశాలు అలా పోలి ఉండడంతో వర్మకి ఈ విధంగా కలిసిరానుంది. మరి వర్మ ఈ వైరల్ ఇష్యూని తన సినిమా పబ్లిసిటీ కోసం ఎంతవరకూ వాడుకొంటారో చూడాలి.