తమిళంలో హిట్ అయిన ‘గరుడన్’ చిత్రాన్ని తెలుగులో ‘నాంది’ దర్శకుడు విజయ్ కనకమేడల (Vijay Kanakamedala) రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘శ్రీ సత్య సాయి ఆర్ట్స్’ బ్యానర్ పై కె కె రాధామోహన్ (K. K. Radhamohan) ఈ చిత్రాన్ని (Bhairavam) నిర్మిస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) మెయిన్ హీరోగా నటిస్తుండగా మరో ఇద్దరు హీరోలు మంచు మనోజ్ (Manoj Manchu) , నారా రోహిత్ (Nara Rohith)..లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఓ క్రేజీ మల్టీస్టారర్ గా రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ను కొద్దిసేపటి క్రితం యూట్యూబ్లో రిలీజ్ చేశారు.
1:27 నిమిషాల నిడివి కలిగిన ఈ టీజర్.. జయసుధ (Jaya Sudha) వాయిస్ ఓవర్ తో మొదలైంది.ఒక ఊరిలో ఉండే వారాహి అమ్మవారి గుడి… ఆ గుడిని కాపాడుతున్న ముగ్గురు అన్నదమ్ముల్లాంటి స్నేహితులు.. ఈ క్రమంలో వాళ్లకు వచ్చిన సమస్యలు..! వంటి వాటిని ఆధారం చేసుకుని టీజర్ ను కట్ చేశారు. టీజర్ మొత్తం యాక్షన్ ఎలిమెంట్స్ తో నింపేశారు. మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్..ల క్యారెక్టర్స్ ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాయి.
టీజర్ చివర్లో ‘రామలక్ష్మణులను సముద్రం దాటించడానికి హనుమంతుడు ఉన్నట్టు ఈ రామలక్ష్మణులకు ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి ఈ శీను గాడు ఉన్నాడు’ అంటూ వచ్చే డైలాగ్ బాగుంది. అలాగే చివరి షాట్లో బెల్లంకొండ శ్రీనివాస్ పాత్ర పూనకం వచ్చినట్టు ఊగిపోవడం అనేది అందరికీ ‘కాంతార’ క్లైమాక్స్ ను గుర్తుచేస్తుంది అనడంలో సందేహం లేదు. టీజర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :