‘ఆర్.ఎక్స్.100’ హీరో కార్తికేయ (Karthikeya).. ఆ తర్వాత చాలా సినిమాలు చేశాడు కానీ, ఏది కూడా దాని రేంజ్లో బ్లాక్ బస్టర్ కాలేదు. ‘బెదురులంక 2012 ‘ (Bedurulanka 2012) గతేడాది రిలీజ్ అయ్యి డీసెంట్ సక్సెస్ అందుకుంది కానీ అది ‘ఆర్.ఎక్స్.100’ రేంజ్ సక్సెస్ కాదు. ఇక అతను హీరోగా రూపొందిన ‘భజే వాయు వేగం’ (Bhaje Vaayu Vegam) అనే మూవీ మే 31 న రిలీజ్ కాబోతుంది. యూవీ కాసెప్ట్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రానికి ప్రశాంత్ రెడ్డి దర్శకుడు.
రథన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ (Iswarya Menon) హీరోయిన్ గా నటించింది. ‘బెదురులంక 2012 ‘ సక్సెస్ అవ్వడం, యూవీ బ్యానలో రూపొందిన సినిమా కావడంతో ‘భజే వాయు వేగం’ కి డీసెంట్ బిజినెస్ జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
నైజాం | 1.80 cr |
సీడెడ్ | 0.70 cr |
ఉత్తరాంధ్ర | 0.45 cr |
ఈస్ట్ | 0.28 cr |
వెస్ట్ | 0.22 cr |
గుంటూరు | 0.25 cr |
కృష్ణా | 0.30 cr |
నెల్లూరు | 0.12 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 4.12 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.15 cr |
ఓవర్సీస్ | 0.18 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 4.45 cr (షేర్) |
‘బెదురులంక 2012’ చిత్రానికి రూ.4.45 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.పాజిటివ్ టాక్ కనుక వస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవడం కష్టమేమి కాదు.