Bhala Thandanana : భళా తందనాన సినిమా రివ్యూ & రేటింగ్!

నటీనటులు: శ్రీవిష్ణు, కేతరీన్, గరుడ తదితరులు..

సాంకేతికవర్గం:
దర్శకత్వం: చైతన్య దంతులూరి
ఛాయాగ్రహణం: సురేష్ రగుటు
సంగీతం: మణిశర్మ
నిర్మాణం: వారాహి చలనచిత్రం
నిర్మాత: రజని కొర్రపాటి
విడుదల తేదీ: మే 06, 2022

శ్రీవిష్ణు కథానాయకుడిగా తెరకెక్కిన తాజా చిత్రం “భళా తందనాన”. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి “బాణం, బసంతి” ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకుడు. శ్రీవిష్ణు మునుపటి చిత్రాలు మరియు విడుదలైన ప్రచార చిత్రాల వలన ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి నెలకొనలేదు. మరి ఇవాళ విడుదలైన చిత్రం ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!

కథ:
చందు (శ్రీవిష్ణు) ఓ ఎన్.జి.ఓ లో అకౌంటెంట్ గా వర్క్ చేస్తుంటాడు. ఆ సంస్థలో జరుగుతున్న అన్యాయాన్ని కవర్ చేయడానికి వచ్చిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ శశిరేఖ (కేతరీన్)తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. ఈ ఇద్దరూ అనుకోని విధంగా ఆనంద్ బాలి (గరుడ రామ్) హవాలా బిజినెస్ లో ఇరుక్కుంటారు. ఏకంగా రెండు వేల కోట్ల హవాలాలో చందు-శశిరేఖలు ఊహించని విధంగా భాగస్వాములౌతారు.
అసలు చందు గతమేమిటి? శశిరేఖకు హవాలాతో ఉన్న సంబంధం ఏమిటి? ఆనంద్ బాలి హవాలా బిజినెస్ కి చందు ఎందుకు అడ్డంకిగా నిలిచాడు? అనేది “భళా తందనాన” చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటు పనితీరు:
రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో శ్రీవిష్ణు ఆకట్టుకున్నాడు. అయితే.. శ్రీవిష్ణు క్యారెక్టర్ కి సరైన జస్టిఫికేషన్ ఇవ్వకుండా సెకండ్ పార్ట్ లో క్లారిటీ ఇస్తామన్నట్లు ముగించడం వల్ల శ్రీవిష్ణు పాత్ర బిహేవియర్ కి ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు.
కేతరీన్ అండంతోపాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. కొంచెం గ్యాప్ వచ్చిన ఆమెకు చక్కని పాత్ర లభించిందనే చెప్పాలి. “కేజీఎఫ్” ఫేమ్ గరుడ విలనిజం బాగున్నా అతడికి సూట్ అవ్వని విగ్ పెట్టి కమెడియన్ లా ఎలివేట్ చేశారు. అందువల్ల అతడి క్రూరత్వాన్ని ప్రేక్షకులు ఫీలవ్వలేరు. “రౌడీ ఫెలో” తర్వాత పోసాని-సత్యల కాంబినేషన్ మళ్ళీ నవ్వించింది.

సాంకేతికవర్గం పనితీరు:
చైతన్య దంతులూరి మునుపటి రెండు సినిమాలు కమర్హియల్ పాట్ బాయిలర్స్ కాదు. రెండు సినిమాలతోనూ మంచి సందేశం ఇద్దామనుకున్నాడు. అయితే బాణం వర్కవుటయినట్లుగా బసంతి అలరించలేకపోయింది. అందుకే కమర్షియల్ సక్సెస్ కోసం “భళా తందనాన” తెరకెక్కించాడు చైతన్య. అయితే.. ఈ చిత్రంతో దర్శకుడిగా కంటే కథకుడిగా ప్రేక్షకుల్ని అమితంగా నిరాశపరిచాడు. ఫస్టాఫ్ మొత్తం క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ కే సరిపెట్టాడు. సెకండాఫ్ పర్వాలేదు అనిపించినా.. ముగించిన విధానం మాత్రం సోసోగానే ఉంది.
కెమెరామెన్ సురేష్ రగుటు మాత్రం తన బెస్ట్ ఇచ్చాడు. మణిశర్మ బాణీలు సోసోగా ఉన్నా.. నేపధ్య సంగీతంతో మాత్రం ఆకట్టుకున్నాడు. ప్రొడక్షన్ డిజైన్ విషయంలో మాత్రం ఇంకాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది.

విశ్లేషణ:
స్క్రీన్ ప్లే & క్యారెక్టరైజేషన్స్ విషయంలో సరైన క్లారిటీ-జస్టిఫికేషన్ లోపించడం కారణంగా అలరించలేకపోయిన చిత్రం “భళా తందనాన”. నటుడిగా శ్రీవిష్ణు పర్వాలేదు అనిపించుకున్నా.. కథకుడిగా చైతన్య దంతులూరి నిరాశపరచడంతో ఒటీటీ వాచ్ గా మిగిలిపోయింది.

రేటింగ్: 1.5/5

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus