Bhale Unnade Collections: ‘భలే ఉన్నాడే’ 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..?
- September 15, 2024 / 08:06 PM ISTByFilmy Focus
యంగ్ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) నుండి వస్తున్న లేటెస్ట్ మూవీ ‘భలే ఉన్నాడే’ (Bhale Unnade) . దర్శకుడు మారుతి టీం నుండి వస్తున్న సినిమా కావడంతో దీనిపై కొంతమంది ఆడియన్స్ దృష్టి పడింది. ‘గీతా సుబ్రమణ్యం’, ‘పెళ్లిగోల 2’ వంటి వెబ్ సిరీస్…లు తెరకెక్కించిన శివ సాయి వర్ధన్ (J Sivasai Vardhan) డైరెక్ట్ చేసిన మొదటి సినిమా ఇది. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్..లో మారుతి (Maruthi Dasari) మార్క్ కనిపించింది. ఇక మొదటి రోజు ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది. కామెడీ, ఎమోషన్ బాగా వర్కౌట్ అయినట్టు అంతా చెప్పుకున్నారు.
Bhale Unnade Collections

మొదటి రోజు ఓపెనింగ్స్ కూడా పర్వాలేదు అనిపించాయి. కానీ 2వ రోజు ‘మత్తు వదలరా 2’ దెబ్బకి దారుణంగా పడిపోయాయి. ఒకసారి (Bhale Unnade Collections) 2 డేస్ కలెక్షన్స్ గమనిస్తే :
| నైజాం | 0.21 cr |
| సీడెడ్ | 0.06 cr |
| ఉత్తరాంధ్ర | 0.09 cr |
| ఈస్ట్+వెస్ట్ | 0.05 cr |
| కృష్ణా+గుంటూరు | 0.07 cr |
| నెల్లూరు | 0.04 cr |
| ఏపి+తెలంగాణ | 0.52 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ | 0.08 cr |
| వరల్డ్ వైడ్(టోటల్) | 0.60 cr |
‘భలే ఉన్నాడు’ చిత్రానికి రూ.1.53 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.1.8 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజుల్లో ఈ సినిమా రూ.0.60 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకో రూ.1.20 కోట్ల షేర్ ను రాబట్టాలి. రాజ్ తరుణ్ బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ ఇవ్వడం వల్ల.. ఇప్పుడు పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాకి కూడా జనాలు రావడం లేదని స్పష్టమవుతుంది.














