టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ ‘స్పైడర్’ వంటి రెండు ప్లాప్ లు ఫేస్ చేస్తున్న టైంలో తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేశాడు. ‘ఆర్.ఆర్.ఆర్’ ఫేమ్ డీవీవీ దానయ్య ఈ చిత్రానికి నిర్మాత. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. 2018 ఏప్రిల్ 20న ఈ చిత్రం విడుదలైంది. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది ఈ చిత్రం.
మహేష్ సీఎం భరత్ గా నట విశ్వరూపం చూపించగా.. దర్శకుడు కొరటాల శివ తన టేకింగ్ తో మెస్మరైజ్ చేశాడు. కథ చాలా వరకు ‘లీడర్’ సినిమాకి దగ్గరగా ఉన్నా.. ఇది పూర్తిగా డిఫరెంట్ టేకింగ్ తో రూపొందింది. నేటితో ఈ చిత్రం రిలీజ్ అయ్యి 6 ఏళ్ళు పూర్తి కావస్తోంది. దీంతో సోషల్ మీడియాలో ‘#5YearsForBharatAneNenu’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 21.32 cr |
సీడెడ్ | 10.45 cr |
ఉత్తరాంధ్ర | 9.33 cr |
ఈస్ట్ | 4.50 cr |
వెస్ట్ | 7.28 cr |
గుంటూరు | 8.31 cr |
కృష్ణా | 5.86 cr |
నెల్లూరు | 2.70 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 69.75 cr |
కర్ణాటక | 0.35 cr |
తమిళనాడు + కేరళ | 8.15 cr |
ఓవర్సీస్ | 2.40 cr |
రెస్ట్ | 1.55 cr |
ఓవర్సీస్ | 17.50 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 99.35 cr |
‘భరత్ అనే నేను’ (Bharat Ane Nenu) చిత్రానికి రూ.98.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.99 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే ఫుల్ రన్లో ఈ మూవీ రూ.99.35 కోట్ల షేర్ ను రాబట్టి.. కొద్దిలో రూ.100 కోట్ల షేర్ మార్క్ ను మిస్ అయ్యింది.
‘రంగస్థలం’ వంటి మరో పెద్ద సినిమా పోటీగా ఉండటం, తర్వాత ఇంకో పెద్ద సినిమా రిలీజ్ అవ్వడం, ఐపీఎల్ సీజన్, ‘అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్’ వంటి భారీ పోటీలో ‘భరత్ అనే నేను’ ఆ రేంజ్లో కలెక్ట్ చేయడం మామూలు విషయం కాదు. కొన్ని ఏరియాల్లో ఈ మూవీ కొద్దిపాటి నష్టాలను మిగిల్చినా.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.0.35 కోట్ల మినిమమ్ ప్రాఫిట్స్ తో హిట్ మూవీగా నిలిచింది.
శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!
బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!