అత్యధిక మంది లైక్‌ చేసిన టీజర్లలో రెండో స్థానంలో భరత్ విజన్.!

కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న “భరత్ అనే నేను” సినిమా రోజురోజుకి అంచనాలను పెంచుకుంటూ పోతోంది. మొదటగా ఫస్ట్ ఓత్ పేరుతో ముఖ్యమంత్రిగా మహేష్ ప్రమాణం చేస్తున్న వాయిస్ అందరినీ ఆకర్షించింది. ఈ మూవీ టీజర్ “ది విజన్ ఆఫ్ భరత్’ పేరుతో రిలీజ్ అయి రికార్డు సృష్టించింది. ఈ వీడియో 19గంటల్లోనే కోటి డిజిటల్ వ్యూస్‌ని రాబట్టి ఔరా అనిపించింది. ఆ దూకుడు అలాగే కొనసాగుతోంది. ఈ టీజర్‌ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది లైక్‌ చేసిన టీజర్లలో రెండో స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని చిత్ర వర్గాలు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించాయి.

ఇప్పటివరకూ 6,40,000 మంది లైక్‌ చేసినట్లు ప్రకటించాయి. తెలుగు సినిమా ఈ రికార్డు నెలకొల్పడం టాలీవుడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఈ సందర్భంగా “BAN 2nd most liked teaser in world’ హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్‌ అవుతోంది. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలో మిగిలిఉన్న ఒక పాట షూటింగ్ కోసం చిత్ర యూనిట్ స్పెయిన్ వెళ్లనుంది. అప్పట్లోపున డబ్బింగ్ కంప్లీట్ చేసే పనిలో మహేష్ టీమ్ ఉన్నారు. నిర్మాత డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇండస్ట్రీ హిట్ శ్రీమంతుడు కాంబినేషన్లో తెరకెక్కిన  ఈ మూవీ ఏప్రిల్‌ 20న రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus