కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా శంకర్ (Shankar) దర్శకత్వంలో 1996 లో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రం ఘన విజయం సాధించింది. దాదాపు 28 ఏళ్ళ తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్ గా ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2) రాబోతోంది. కమల్ హాసన్ తో పాటు సిద్దార్థ్ (Siddharth) కూడా ఈ సినిమాలో అతి కీలకమైన పాత్ర పోషించాడు. రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh), ఎస్.జె.సూర్య (S. J. Suryah) , బాబీ సింహా (Bobby Simha) వంటి స్టార్స్ కూడా నటించారు.కాజల్ (Kajal Aggarwal) చిన్న అతిథి పాత్రలో కనిపించబోతుంది.
ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ఫస్ట్ సింగిల్, ట్రైలర్ జస్ట్ ఓకే అనిపించే రెస్పాన్స్ ను రాబట్టుకున్నాయి. జూలై 12 న ‘భారతీయుడు 2 ‘ సినిమా రిలీజ్ కాబోతోంది. తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని కొన్ని కట్స్ తో యు/ఎ సర్టిఫికెట్ ను జారీ చేసింది చిత్ర బృందం. ఇక రన్ టైం అయితే ఏకంగా 3 గంటల 4 నిమిషాలు వచ్చిందట. ఇక ఆ డిలీట్ చేసిన సన్నివేశాల విషయానికి వస్తే..
స్మోకింగ్ సీన్స్ వచ్చినప్పుడు.. ‘పొగత్రాగుట ఆరోగ్యానికి హానికరం’ అని స్క్రీన్ పై కొంత సైజ్ ఆకుపై చేసేలా అలెర్ట్ మెసేజ్ పడుతుందట.
ఇక సినిమా స్టార్ట్ అయిన 21 నిమిషాల 46 సెకన్లకి ‘బ్రైబ్ మార్కెట్’ అనే పదం వస్తుందట. ఆ పదాన్ని మార్చినట్లు తెలుస్తోంది.
ఓ సన్నివేశంలో అమ్మాయి క్లీవేజ్ షో కనపడుతున్నందున.. బ్లర్ చేసినట్లు సమాచారం.
ముండ,ఫ*క్, డర్టీ ఇండియన్ వంటి పదాలని మ్యూట్ చేశారట.
మరికొన్ని సన్నివేశాల వద్ద ‘NOC’ సబ్మిట్ చేసినట్టు అలెర్ట్ మెసేజ్ పడుతుందట.