పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్లో సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. మలయాళం సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కు రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ‘సితార ఎంటెర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి సంభాషణలు,కథలో మార్పులు చేయడం విశేషం. ఇక ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 25న విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించగా ట్రైలర్ ను ఫిబ్రవరి 21న విడుదల చేయబోతున్నట్టు వెల్లడించింది చిత్రబృందం.
ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్లు సూపర్ హిట్ అవ్వడంతో ‘భీమ్లా నాయక్’ కు థియేట్రికల్ బిజినెస్ అదిరిపోయింది.
ఒకసారి ఆ వివరాలను గమనిస్తే :
నైజాం | 35.00 cr |
సీడెడ్ | 17.00 cr |
ఉత్తరాంధ్ర | 9.50 cr |
ఈస్ట్ | 6.50 cr |
వెస్ట్ | 5.60 cr |
గుంటూరు | 7.20 cr |
కృష్ణా | 6.00 cr |
నెల్లూరు | 3.20 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 90.00 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 10.50 cr |
ఓవర్సీస్ | 9.00 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 109.50 cr |
‘భీమ్లా నాయక్’ చిత్రానికి రూ.109.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.110 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 2022 లో రాబోతున్న మొదటి పెద్ద చిత్రమిది. ఏమాత్రం హిట్ టాక్ వచ్చినా టికెట్ రేట్లతో సంబంధం లేకుండా రూ.150కోట్ల నుండీ రూ.200 కోట్ల మధ్యలో షేర్ ను రాబట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే హిట్ టాక్ వస్తే మాత్రమే..! మరి ‘భీమ్లా’ అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి..!
Most Recommended Video
ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!