పవన్ కళ్యాణ్- రానా కాంబినేషన్లో ‘భీమ్లా నాయక్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కు ఇది రీమేక్ గా తెరకెక్కుతుంది. అక్కడైతే ఇది ఓ మల్టీస్టారర్ కానీ తెలుగుకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ బ్రాండ్ తోనే థియేటర్లకు రాబోతుంది. ఫిబ్రవరి 25న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతుందని నిర్మాతలు ప్రకటించారు. ఆ డేట్ ఫిక్స్ అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకి రెస్పాన్స్ అదిరిపోయింది.
హిందీలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. 2022లో థియేటర్లకు రాబోతున్న పెద్ద సినిమా ఇదే కావడంతో పాన్ ఇండియా సినిమాలను మించి ఈ మూవీ కలెక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ మూవీ వల్ల తర్వాత రాబోయే ‘రాధే శ్యామ్’ మూవీ పై ఎఫెక్ట్ పడుతుందా? అంటే కచ్చితంగా పడుతుందనే కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ‘భీమ్లా నాయక్’ అనేది పక్కా మాస్ ఎంటర్టైనర్ మూవీ.
‘రాధే శ్యామ్’ మార్చి 11న రిలీజ్ అవుతుంది.. అంటే దానికి రెండు వారాల ముందు రిలీజ్ అవుతుంది కాబట్టి.. ‘భీమ్లా’ కి భారీ ఓపెనింగ్స్ నమోదవుతాయి. పైగా ఎక్కువ థియేటర్లు పవన్ సినిమాకి దక్కుతాయి. సినిమాకి హిట్ టాక్ కనుక వస్తే… రెండు వారాల తర్వాత కూడా థియేటర్లను హోల్డ్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు ‘రాధే శ్యామ్’ కు ‘భీమ్లా’ దక్కినన్ని థియేటర్లు దక్కవు. అప్పుడు ‘రాధే శ్యామ్’ ఓపెనింగ్స్ ఎక్కువ స్థాయిలో నమోదు కాకపోవచ్చు.
‘రాధే శ్యామ్’ లో మాస్ ఎలిమెంట్స్ ఏమీ లేకపోవడంతో పూర్తిగా అది ప్రభాస్ ఫ్యాన్ బేస్ పైనే ఆధారపడాల్సి ఉంటుంది. ‘భీమ్లా’ కనుక మళ్ళీ వాయిదా పడితే… ‘రాధే శ్యామ్’ బుకింగ్స్ కు ఇబ్బంది ఉండదు.