Aadikeshava: బీమ్లా నాయక్ లో సాంగ్ ఆదికేశవ్ సినిమా కోసం వాడుతున్నారా!

గత ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘భీమ్లా నాయక్’ చిత్రం విడుదలై ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే. విడుదలకు ముందు నుండే భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న ఈ చిత్రం, విడుదల తర్వాత మొదటి ఆట నుండే సునామి లాంటి ఓపెనింగ్స్ ని దక్కించుకుంది. విడుదలకు వారం రోజుల ముందు విడుదల తేదీన ప్రకటించి హడావడి గా విడుదల చేసినప్పటికీ నైజాం ప్రాంతం లో ఆల్ టైం డే 1 రికార్డు ని నెలకొల్పింది.

ఎన్నో రాజకీయ వత్తిడుల కారణంగా ఈ సినిమాకి ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ రేట్స్ బాగా తగ్గించేశారు. అయినప్పటికీ కూడా ఈ సినిమాకి ఫుల్ రన్ లో 97 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లు వచ్చాయి. ఫ్యామిలీ ఆడియన్స్ చూసే విధంగా సినిమా లేకపోయినా కూడా, లాంగ్ రన్ లో పర్వాలేదు అనే రేంజ్ రన్ ని దక్కించుకుంది.

ఇది ఇలా ఉండగా విడుదలకు ముందు ఈ సినిమాలోని పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో మన అందరికీ తెలిసిందే. టైటిల్ సాంగ్ మరియు ‘లాలా భీమ్లా’ సాంగ్స్ మాస్ ఆడియన్స్ కి పూనకాలు రప్పిస్తే, ‘అంత ఇష్టం’ పాట క్లాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. అప్పట్లో ఇంస్టాగ్రామ్ రీల్స్ లో ఈ పాట ఒక సెన్సేషన్. నెటిజెన్స్ అందరూ కూడా ఈ సాంగ్ ని రీల్ చేసి అప్లోడ్ చేసేవారు. అలా పాపులర్ అయినా ఈ సాంగ్ ని చిత్రీకరించలేకపోయింది మూవీ టీం. అందుకు కారణం కావాల్సినంత సమయం లేకపోవడమే.

దీంతో ఈ సూపర్ హిట్ సాంగ్ ని ఈ చిత్రం నుండి తొలగించారు. అయితే ఈ పాటని ఇప్పుడు వేరే సినిమా కోసం వాడబోతున్నాడట ఆ చిత్ర నిర్మాత నాగ వంశీ. ప్రస్తుతం ఆయన పంజా వైష్ణవ్ తేజ్ తో ‘ఆది కేశవ్ ‘ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో ఒక సందర్భంలో ఈ పాట ని ఉపయోగించబోతున్నట్టు సమాచారం, శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం, అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus