2022 సంక్రాంతికి ‘భీమ్లా నాయక్’ ‘సర్కారు వారి పాట’ ‘రాధే శ్యామ్’ వంటి సినిమాలు విడుదలవుతాయని ఆ చిత్రాల నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. కానీ అనూహ్యంగా ‘ఆర్.ఆర్.ఆర్’ ను జనవరి 7న విడుదల చేస్తున్నట్టు ప్రకటించి పెద్ద బాంబ్ పేల్చాడు రాజమౌళి. దాంతో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ‘సర్కారు వారి పాట’ ఏప్రిల్ కు వెళ్ళింది. కానీ ‘భీమ్లా నాయక్’ ‘రాధే శ్యామ్’ లు తగ్గలేదు.మధ్యలో ‘బంగార్రాజు’ కూడా రేసులోకి వచ్చినా ఆ సినిమా వల్ల మిగిలిన సినిమాల పై పెద్దగా ప్రభావం పడే అవకాశం లేదు.
ఇక ‘రాధే శ్యామ్’ జనవరి 14న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు కాబట్టి… ‘ఆర్.ఆర్.ఆర్’ కు ఒక వారం గ్యాప్ దొరుకుతుంది. దాంతో పెద్దగా ఇబ్బంది లేనట్టే..!కానీ ‘భీమ్లా నాయక్’ జనవరి 12నే విడుదల చేస్తే తెలుగు రాష్ట్రాల్లో ‘ఆర్.ఆర్.ఆర్’ వసూళ్ళ పై దెబ్బ పడుతుంది. ఇందుకోసం రాజమౌళి ప్రత్యేకంగా పవన్ ను కలిసి ‘భీమ్లా’ ను పోస్ట్ పోన్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేయాలని భావించారు.కానీ ఇప్పుడు ఆ ఆలోచనని ఆయన విరమించుకున్నట్టు టాక్.
దానికి ప్రధాన కారణం ‘భీమ్లా నాయక్’ సంక్రాంతి రేసు నుండీ తప్పుకోవడమే అని తెలుస్తుంది. ‘భీమ్లా నాయక్’ జనవరి 25కి పోస్ట్ పోన్ అయినట్టు కథనాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే నిర్మాత నాగ వంశీ మాత్రం ‘లాలా భీమ్లా రష్ చూసాను జనవరి 12న దాని బ్లాస్ట్ కి థియేటర్లు దద్దరిల్లాల్సిందే’ అంటూ ట్వీట్ చేసాడు. అంటే ఆ వార్తలకి నిర్మాత భారీ కౌంటర్ ఇచ్చినట్టే..!మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి..!