‘భీమ్లా నాయక్’ సినిమా ఫిబ్రవరి 25న వస్తుందా? అదేంటి మొన్నీమధ్య చిత్రబృందం ప్రకటించింది కదా అంటారా. నిజమే టీమ్ అయితే చెప్పింది. కానీ ఇప్పటివరకు సినిమా ప్రచారం మొదలవ్వలేదు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరల విషయం ఇంకా కొలిక్కి రాలేదు. ఇప్పటి ధరలతో సినిమాలు రిలీజ్ చేసి ఇబ్బంది పడటం సరికాదు అని కూడా అనుకుంటున్నారు. దీంతో డౌట్స్ ఉన్నాయి. అయితే ఓవర్సీస్‌లో సినిమా ప్రచారం షురూ అయ్యింది. అడ్వాన్స్ బుకింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. సో సినిమా 25న పక్కా అంటున్నారు.
ఓవర్సీస్‌లో ‘భీమ్లా నాయక్’ సినిమాను 400కుపైగా స్క్రీన్లలో విడుదల చేస్తున్నారట. దీనికి సంబంధించిన పోస్టర్‌ను సంగీత దర్శకుడు తమన్ షేర్ చేశాడు. దీంతో సినిమా రిలీజ్ డేట్ మారడం ఇక కష్టమే అంటున్నారు. అయితే ఇక్కడ ప్రచారం ఎందుకు షురూ చేయలేదు అనేదే ప్రశ్న. ప్రస్తుతం చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉందట. ఇటీవలే పవన్ కల్యాణ్ కూడా డబ్బింగ్ పూర్తి చేసుకున్నాడు. కాబట్టి ఒకటి రెండు రోజుల్లో ప్రచారం జోరు పెంచొచ్చు అని టాక్.
అయితే ఏపీలో సినిమా టికెట్ రేట్ల విషయంలో ఫిబ్రవరి 25న తేలుతుంది అనే టాక్ కూడా వినిపిస్తోంది. అంటే ‘భీమ్లా నాయక్’ వచ్చిన తర్వాతే టికెట్ రేట్లు పెంచుతారట. ఆ లెక్కన 25న టికెట్ రేట్ల విషయం తేలినా అమలు ఏ వారం తర్వాతో పెడతారని మరో టాక్. ఈ లెక్కన పవన్ కల్యాణ్ సినిమాపై ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు కొనసాగుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే సినిమా ప్రొడ్యూసర్‌కి టికెట్ల రేట్ల విషయంలో పక్కా సమాచారం ఉండటం వల్లే ఇలా డేట్ అనౌన్స్ చేశారు అని అంటున్నారు.
‘భీమ్లా నాయక్ ’ వస్తున్నట్లు ప్రకటించినా ‘ఆడాళ్లు మీకు జోహార్లు’, ‘గని’, ‘సెబాస్టియన్’ సినిమాలు వాయిదా వేయడం లేదు. వాళ్లు ధైర్యం ఏంటి అనేది మరో ప్రశ్న. పవన్ సినిమాతో పోటీ పడి అవసరమైన థియేటర్లు సంపాదించగలుగుతారా? అనేది మరో ప్రశ్న. దీనికి సమాధానం దొరకడం అంత ఈజీ కాదు.
Most Recommended Video
ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!