టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న సినిమా భీమ్లా నాయక్. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుందని అనిపిస్తోంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కలిసి నటించిన భీమ్లా నాయక్ సినిమా పై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇక ఫిబ్రవరి 25వ తేదీన భారీ స్థాయిలో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. సినిమాకు సంబంధించిన ట్రైలర్ కు కూడా పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది.
ఓ వర్గం వారు మాత్రం సినిమా ట్రైలర్ అనుకున్నంతగా లేదు అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆ సంగతి పక్కన పెడితే సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం భారీ స్థాయిలో నిర్వహించాలని అనుకున్నారు. కానీ హఠాత్తుగా ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ గౌతమ్ రెడ్డి మరణించడంతో పవన్ కళ్యాణ్ వేడుకలను జరుపుకోవడం మంచిది కాదు అని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. మళ్లీ ఎప్పుడు ఎలా నిర్వహిస్తారు అనే విషయం లో చిత్ర యూనిట్ సభ్యులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఫిబ్రవరి 23వ తేదీన బుధవారం మళ్లీ అదే తరహా ప్లానింగ్ తో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలి అని చిత్ర యూనిట్ సభ్యులు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని పోలీస్ గ్రౌండ్స్ లో మళ్లీ సాయంత్రం 6 గంటల సమయానికి రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఇక ఈ వేడుకకు తెలంగాణ మినిస్టర్ కేటీఆర్ తో పాటు సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించిన విషయం తెలిసిందే.
అయితే వేడుక వాయిదా వేయడంతో మళ్లీ వారు అనుకున్న సమయానికి ఈవెంట్ కు వస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాంటి విషయాలపై స్పందిస్తూ అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు త్రివిక్రమ్ డైలాగ్స్ అంధించారు.