‘భీమ్లా నాయక్’ సినిమా రిలీజ్ డేట్‌ని చిత్రబృందం ఇటీవల అఫీషియల్‌గా ప్రకటించింది. ముందు చెప్పిన డేట్స్‌లో ఒకటైన ఫిబ్రవరి 25ని అనౌన్స్ చేసేసింది. దీంతో ఆ రోజు విడుదల చేద్దామని ఫిక్స్ అయిన సినిమాలు కాస్త అయోమయంలో పడ్డాయి. ఇదంతా ఆ సినిమాలకు సంబంధించినంత వరకు. అయితే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం వల్ల ఫ్యాన్స్‌కు ఓ మంచి జరిగింది. అదే సినిమా రన్‌టైమ్ మీద క్లారిటీ వచ్చింది. సినిమా రిలీజ్‌కు ఇంకా పది రోజలు సమయమే ఉండటంతో…
ఓవర్సీస్‌లో సినిమా టికెట్ల అమ్మకం ప్రారంభించేశారు. ఈ క్రమంలో బుకింగ్ వెబ్‌సైట్స్‌లో సినిమా రన్ టైమ్ గురించి ప్రస్తావన కనిపించింది. వాటి ప్రకారం చూసుకుంటే… రన్‌టైమ్ రెండు గంటల 21 నిమిషాలేనట. ఈ సినిమా మాతృక ‘అయ్యప్పనుమ్ కొషియమ్’ రన్‌టైమ్ చూస్తే రెండు గంటల 57 నిమిషాలు. ఆ సినిమా వచ్చిన కొత్తల్లో నిడివి ఎక్కువైందనే మాటలూ వినిపించాయి. దీంతోనే ఇప్పుడు‘భీమ్లా నాయక్’ టీమ్ జాగ్రత్తపడిందట. సినిమాలో అవసరం లేవనుకున్న సన్నివేశాలకు కత్తెర వేసిందట.
అలాగే ఓ మాంటేజ్ సాంగ్‌ని తీసేశారట. దీంతో చాలావరకు సినిమా ట్రిమ్ అయ్యిందని చెబుతున్నారు. దాంతోపాటు ఎలివేషన్ సీన్స్‌పై దృష్టి సారించి, అనవసరమైన సీన్స్‌ను పక్కన పెట్టేశారట. దీంతో ‘అయ్యప్పనుమ్ కొషియమ్’తో పోలిస్తే ‘భీమ్లా నాయక్’లో మాస్ మేనరిజమ్స్, ఎలివేషన్లు ఎక్కువగానే ఉంటాయి అంటున్నారు. అలా సినిమాలో సుమారు 36 నిమిషాలు తొలగించేశారట. సినిమాను త్వరలో సెన్సార్‌కు పంపిస్తారని టాక్. ఆ వెంటనే ట్రైలర్ లాంచ్ చేస్తారని అంటున్నారు. ఇప్పటికే ట్రైలర్ కట్ చేసి రెడీగా ఉంచారట.
అలాగే ప్రిరిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేశారట. ఆ ఈవెంట్‌కి బయట గెస్ట్‌లు కాకుండా, సినిమా టీమ్‌తోనే జరపాలని అనుకుంటున్నారట. త్వరలో దీనిపై క్లారిటీ వస్తుంది. అయితే సినిమాలో మరో 12 నిమిషాలు రీసెంట్‌గా యాడ్ చేశారని వార్తలు వస్తున్నాయి. రెండు గంటల 21 నిమిషాలకు ఇది అదనమా కాదా అనేది తెలియాల్సి ఉంది.
Most Recommended Video
ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!