Nithiin: నితిన్ తో మరో హిట్ కొడతాడా..?

దర్శకుడు త్రివిక్రమ్ దగ్గర శిష్యరికం చేసిన వెంకీ కుడుముల.. ‘ఛలో’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్నాడు. ఆ తరువాత యంగ్ హీరో నితిన్ తో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘భీష్మ’ సినిమా గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ ను అందుకుంది. ఈ సినిమాతో హిట్టు కొట్టిన వెంకీకి ఇండస్ట్రీ నుండి చాలా మంది హీరోలు ఫోన్లు చేసి మాట్లాడారు. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు కూడా వెంకీని అప్రిషియేట్ చేశారు.

కానీ ఇప్పటివరకు తన తదుపరి సినిమాను సెట్ చేసుకోలేకపోయాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. దానికి లాక్ డౌన్ కూడా ఒక చెప్పొచ్చు. అయితే ఇప్పుడు వెంకీ మరోసారి నితిన్ ను డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడని సమాచారం. నిజానికి ‘భీష్మ’ సినిమా ప్రమోషన్స్ లో వెంకీతో మరో సినిమా చేస్తానని నితిన్ స్వయంగా చెప్పుకొచ్చాడు. కానీ ఇంత త్వరగా వీరి కాంబో రిపీట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. నిజానికి వెంకీ స్టార్ హీరోలతో సినిమా చేయాలనుకున్నాడు కానీ వర్కవుట్ కాలేదు.

అలానే వరుణ్ తేజ్, నాగ చైతన్య లాంటి హీరోల పేర్లు వినిపించాయి. కానీ ఇవేవీ కూడా మెటీరియలైజ్ అవ్వలేదని తెలుస్తోంది. దీంతో నితిన్ తోనే తన నెక్స్ట్ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట వెంకీ కుడుముల. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని.. పాండమిక్ సిట్యుయేషన్ కంట్రోల్ లోకి వచ్చిన తరువాత ప్రాజెక్ట్ అనౌన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈసారి ఈ కాంబినేషన్ లో ఎలాంటి సినిమా వస్తుందో చూడాలి!

Most Recommended Video

10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus