Ravi Teja: రవితేజతో సినిమా.. కన్నడ దర్శకుడు హర్ష ఏమన్నాడంటే?

గోపీచంద్ (Gopichand)  హీరోగా ఎ.హర్ష (Harsha) దర్శకత్వంలో ‘భీమా’ (Bhimaa)  సినిమా రూపొందింది.శివరాత్రి కానుకగా మార్చి 8 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గోపీచంద్ సరసన (Malvika Sharma) మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar).. లు హీరోయిన్లుగా నటించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గతంలో ఇదే బ్యానర్లో ‘పంతం’ అనే సినిమా చేశాడు గోపీచంద్. అది గోపీచంద్ కెరీర్ లో 25వ సినిమా. తన ల్యాండ్ మార్క్ మూవీ ఈ బ్యానర్లో చేశాడు కానీ అనుకున్న ఫలితం అయితే దక్కలేదు.

అయితే ఈసారి మంచి సక్సెస్ దక్కుతుంది అని అంతా అనుకుంటున్నారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అది సినిమా పై అంచనాలు ఏర్పడేలా చేసింది. ఇదిలా ఉండగా.. ‘భీమా’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా .. తాజాగా దర్శకుడు హర్ష మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో అతను ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. గతంలో ఇతను రాధామోహన్ నిర్మాణంలో రూపొందిన (Bengal Tiger) ‘బెంగాల్ టైగర్’ కి కొరియోగ్రాఫర్ గా చేసినట్టు చెప్పుకొచ్చాడు.

అలాగే తాను కన్నడలో శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) తో తెరకెక్కించిన ‘వజ్రకాయ’ సినిమాలో (Ravi Teja) రవితేజ గెస్ట్ రోల్ చేసాడని, అలాగే తన సినిమాలకి రవితేజ చాలా హెల్ప్ చేస్తుంటాడని, అతని ఇమేజ్ కి తగ్గ కథలు తన వద్ద ఉన్నాయని, ఛాన్స్ వస్తే తప్పకుండా రవితేజతో సినిమా చేయడానికి ఆశపడుతున్నట్లు’ హర్ష తెలిపాడు. అయితే రవితేజ ఇంకో 2 ఏళ్ళ వరకు ఖాళీగా లేడు.

ఇంటర్వ్యూ : ‘గామి’గురించి డైరెక్టర్ విద్యాధర్ కాగిత చెప్పిన ఆసక్తికర విషయాలు.!

ఇంటర్వ్యూ : ‘భీమా’ గురించి గోపీచంద్ చెప్పిన ఆసక్తికర విషయాలు
రోడ్డుపై యాంకర్ ఝాన్సీ చెత్త సేకరించడానికి కారణాలివేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus