Bhola Shankar: హిందీ భోళా శంకర్‌… చిరంజీవికి గొంతు ఇచ్చింది ఎవరో తెలుసా?

ఈ పాన్ ఇండియా కాలంలో చిన్న సినిమాలు కూడా పాన్‌ ఇండియా రిలీజ్‌ కోసం రెడీ అవుతున్నాయి. మార్కెట్‌ ఉందా లేదా అనేది కూడా చూడకుండా రిలీజ్‌ చేసి ఇబ్బంది పడ్డారు అనుకోండి. ఆ విషయం పక్కనపెడితే ఓ పెద్ద హీరో సినిమా తెలుగులో వచ్చిన కొన్ని రోజులకు ఇప్పుడు హిందీలోకి వస్తోంది. ఆ సినిమానే ‘భోళా శంకర్‌’. ఆగస్టు 11న తెలుగులో విడుదలైన ఈ సినిమాను ఇప్పుడు హిందీలోకి తీసుకెళ్తున్నారు. ఈ మేరకు సినిమా ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు.

చిరంజీవి – మెహర్‌ రమేశ్‌ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘భోళా శంకర్’. తమిళంలో మంచి విజయం అందుకున్న ‘వేదాళం’ సినిమాకు ఇది రీమేక్. ఈ సినిమాను ఆర్.కె.డి స్టూడియోస్ అనే బాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ హిందీలో రిలీజ్‌ చేయబోతోంది. ఈ నెల 25న సినిమాను రిలీజ్‌ చేయబోతున్నారు. అన్నట్లు ఈ సినిమాలో చిరంజీవి పాత్రకు బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ డబ్బింగ్ చెప్పినట్లు సమాచారం. దీంతో స్నేహితుడి గొంతుతో చిరంజీవి బాలీవుడ్‌లో ‘భోళా శంకర్’గా వస్తున్నాడు.

80ల కాలం నాటి హీరోలు, హీరోయిన్లు అందరూ కలసి ఓ గ్రూప్‌గా ఏర్పాటు అయిన విషయం తెలిసిందే. ఏటా వాళ్లంతా కలసి ఏటా కలుస్తు ఉంటారు. మరోవైపు జాకీ ష్రాఫ్‌ గొంతు బాలీవుడ్‌లో ఓ ఎమోషన్‌ అని చెప్పొచ్చు. ఇక చిరంజీవి గ్రేస్‌, లుక్స్‌, కామెడీ టైమింగ్‌ సత్తా ఏంటో ఇప్పటి బాలీవుడ్‌ జనాలకు తెలియదు కానీ… ఆ రోజుల్లో చిరుకు బాలీవుడ్‌లో మంచి స్పందనే వచ్చింది. దీంతో నాటి రోజులు మళ్లీ చూడొచ్చు అని బాలీవుడ్‌ జనాలు ట్రైలర్‌ కింద కామెంట్స్‌ చేస్తున్నారు.

అన్నాచెల్లెల అనుబంధం, హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో (Bhola Shankar) ‘భోళా శంకర్’ సినిమా తెరకెక్కింది. చిరంజీవికి జోడీగా తమన్నా నటించగా, సోదరి పాత్రలో కీర్తి సురేష్ నటించింది. సుశాంత్ కీలక పాత్రలో కనిపించాడు. మరి ఈ సినిమాకు బాలీవుడ్‌లో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus