ఈ ఏడాది ప్రారంభం లో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టిన మెగాస్టార్ చిరంజీవి మెగా అభిమానుల్లో నింపిన జోష్ మామూలుది కాదు. ఈ చిత్రం తర్వాత ఆయన ‘భోళా శంకర్’ అనే సినిమా గత కొంతకాలం నుండి చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళం లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ‘వేదలమ్’ చిత్రానికి రీమేక్ ఇది. ఇక్కడ మెగాస్టార్ రేంజ్ కి తగ్గట్టుగా పూర్తి స్థాయి కమర్షియల్ ఎలిమెంట్స్ ని పెట్టి ఒక పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ గా తీర్చి దిద్దామని మెహర్ రమేష్ ఇన్ని రోజులు చెప్పుకొచ్చాడు.
ఇప్పటి వరకు ఈ చిత్రం (Bhola Shankar) నుండి విడుదలైన పాటలు, ట్రైలర్ అన్నీ క్లిక్ అయ్యాయి. దీనితో అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుండా లేదా అనేది చూడాలి. అయితే ఈ సినిమా కు టికెట్ల రేటును పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వాన్ని భోళా శంకర్ చిత్ర యూనిట్ అనుమతి కోరడం జరిగింది.. ఈ నేపథ్యంలో టికెట్ల రేటును పెంచుకునేందుకు ఆమోదం లభించలేదు.
ఈ నెల (ఈ రోజు శుక్రవారం) 11న సినిమా విడుదల కానుండగా.. రేట్ల పెంపుకు పర్మిషన్ ఇవ్వలేదు. అనుమతి లేకపోయినా టికెట్లు అధిక ధరలకు అమ్ముతున్నారంటూ బాపట్లలోని ఎస్. ఎస్. వి థియేటర్లో భోళాశంకర్ సినిమా ప్రదర్శను పోలీసులు అడ్డుకున్నారు. చిరంజీవి బోనాశంకర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో జగన్ ప్రభుత్వంపై చిరు చేసిన వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్‌లో కలకలం సృష్టిస్తున్నాయి. ప్రత్యేక హోదా గురించి, రోడ్లు, ప్రాజెక్టుల నిర్మాణాలపై దృష్టి పెట్టాలని చిరు చురకలు అంటించారు.
ఇప్పటివరకు సైలెంట్‌గా ఉన్న చిరు.. ఒక్కసారిగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. చిరు వ్యాఖ్యలకు మంత్రులు, వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తుండటంతో.. ఈ వివాదం మరింతగా పెరిగింది. చిరు ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించడంతో భోళా శంకర్ సినిమాకు టికెట్ల రేట్లు పెంచుకోవడావనికి అనుమతి రాకపోవచ్చని సినీ వర్గాలు అభిప్రాయపడున్నాయి. సినిమా నిలిపివేతకు రాజకీయ కారణాలు ఉండవచ్చు అని ట్రేడ్ పండితులు అంటున్నారు..