బిచ్చగాడు సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా బిచ్చగాడు2 సినిమా కూడా నిర్మాతలకు మంచి లాభాలను అందించింది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన షీలా రాజ్ కుమార్ తన భర్త నుంచి విడాకులు తీసుకున్నట్టు వెల్లడించారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ సంఖ్యలో సినిమాలలో ఆమె నటించడం గమనార్హం. జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమాలో కూడా షీలా రాజ్ కుమార్ నటించారు.
అరదు చినమ్ అనే సినిమాతో ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
ఈ సినిమా తర్వాత షీలా టూ లెట్ అనే సినిమాలో నటించడం జరిగింది. ఈ సినిమా జాతీయ అవార్డ్ ను సొంతం చేసుకోవడంతో పాటు మంచి లాభాలను సొంతం చేసుకుంది. ఇతర భాషల్లో సైతం చెప్పుకోదగ్గ స్థాయిలో షీలా సినిమాలలో నటించారు. మండేలా మూవీలో పోస్టల్ ఆఫీసర్ రోల్ లో ఈ బ్యూటీ నటించడం గమనార్హం. తన సినీ కెరీర్ లో ఎక్కువగా మంచి పాత్రలలో ఆమె నటించారు. బిచ్చగాడు2 సినిమాలో విజయ్ ఆంటోని చెల్లి పాత్రలో ఆమె నటించడం గమనార్హం .
చోళన్ ను పెళ్లి చేసుకున్న షీలా రాజ్ కుమార్ తాజాగా వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్టు చెప్పారు. అయితే విడాకులు తీసుకోవడానికి తగిన కారణాలను షీలా రాజ్ కుమార్ వెల్లడించడం లేదని సమాచారం అందుతోంది. తన భర్త చోళన్ కు ధన్యవాదాలు తెలుపుతూ ఆమె (Sheela Rajkumar) విడాకులకు సంబంధించిన ప్రకటన చేయడం జరిగింది.
సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం ద్వారా తరచూ వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు. షీలా చేసిన పోస్ట్ కు 2400కు పైగా లైక్స్ వచ్చాయి. ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఓ మై గాడ్ అంటూ షాకింగ్ రియాక్షన్స్ తో అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.