బిచ్చగాడికి…”భారీ” లాబాలు

  • May 31, 2016 / 07:10 AM IST

ప్రముఖ నటుడు విజయ్ ఆంటోని, సత్న టైటస్ జంటగా ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన తమిళ చిత్రం ‘పిచ్చైకారన్’. ఈ సినిమాను తెలుగులో ‘బిచ్చగాడు’ అనే పేరుతో మే 13న విడుదల చేశారు. అయితే ఈ సినీ ఆ విడుదల సమయంలో బ్రహ్మోత్సవం ను తీసేసి మరీ ఈ సినిమాను ప్రదర్శించారు…ఇదిలా ఉంటే సినిమాలో మ్యాటర్ ఉండాలె కానీ, సినిమా సూపర్ హిట్ అవుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు అని మరోసారి నిరూపించింది ఈ చిత్ర. ఎవ్వరూ ఊహించని విధంగా….ఈ సినిమా తెలుగు బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్స్ ను సాధిస్తోంది.  ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ఇప్పటికీ హౌస్ ఫుల్ గా రన్ అవుతూ….ఇప్పటి వరకు దాదాపుగా రూ. 6 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ కలెక్షన్స్ ఇలానే కొనసాగితే…ఫుల్ రన్ లో ఈ చిత్రం రూ. 8 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని టాక్. ఇక్కడ ఇంకో కోసమెరుపు ఏంటంటే….

ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ కేవలం రూ. 50 లక్షలకే తీసుకున్నారట సదరు డిస్ట్రబ్యూటర్. దీన్ని బట్టి లాభాలు ఏ రేంజిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాకు హైలైట్స్ ఏంటి అంటే…. విజయ్ ఆంటోని అద్భుతమైన నటన, సంగీతం, డైరెక్టర్ శశి టేకింగ్, ముఖ్యంగా సినిమాలోని మదర్ సెంటిమెంట్, ఎమోషనల్ పాయింట్స్ సహా చాలా విషయాలకు ఆడియెన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. అది మరీ…బిచ్చగాడి కెప్యాసిటీ!!!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus