విజయ్ ఆంటోనీ హీరోగా సత్నా టైటస్ హీరోయిన్ గా.. దర్శకుడు శశి తెరకెక్కించిన చిత్రం ‘బిచ్చగాడు’. గతంలో వెంకటేష్ తో ‘శీను’ వంటి చిత్రాన్ని కూడా తెరకెక్కించాడు ఈ దర్శకుడు. ఇక అప్పటి వరకూ సంగీత దర్శకుడిగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న విజయ్ ఆంటోనీ ఈ చిత్రంలో నటించడమే కాకుండా.. స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించడం కూడా విశేషం.2016వ సంవత్సరం మే 13న ఈ చిత్రం తెలుగులో విడుదలయ్యింది. నేటితో ఈ చిత్రం విడుదలయ్యి 5ఏళ్ళు పూర్తి కావస్తోంది. మొదట ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు పట్టించుకోలేదు. కానీ రెండో వారం నుండీ ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించి 100 రోజులు ఆడింది. తెలుగులో చాలా కాలం తరువాత 100 రోజులు ఆడిన తమిళ సినిమాగా రికార్డులు సృష్టించింది.
మరి ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 3.20 cr |
సీడెడ్ | 3.75 cr |
ఉత్తరాంధ్ర | 2.25 cr |
ఈస్ట్ | 1.15 cr |
వెస్ట్ | 1.12 cr |
గుంటూరు | 1.48 cr |
కృష్ణా | 1.20 cr |
నెల్లూరు | 0.65 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 14.80 cr |
‘బిచ్చగాడు’ తెలుగు వెర్షన్ కు రూ.2.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఆల్రెడీ తమిళ్ లో హిట్టైన సినిమా కావడంతో ఇక్కడ మంచి బిజినెస్ జరిగిందని చెప్పొచ్చు. అయితే ఫుల్ రన్లో ఈ చిత్రం ఏకంగా రూ.14.8 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే బయ్యర్లకు రూ.12.6 కోట్ల లాభాలు దక్కాయన్న మాట.
Most Recommended Video
థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!