పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘హరిహర వీరమల్లు’(Hari Hara Veera Mallu) ఇప్పుడు బాక్సాఫీస్‌లో ఓ పెద్ద సవాళ్లను ఎదుర్కోబోతోంది. ఈ చిత్రం షూటింగ్ దశలోనే అనేక సార్లు వాయిదా పడింది. పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యాచరణ కారణంగా చిత్రీకరణ నెమ్మదించింది. మూడేళ్లుగా ఈ సినిమా పనులు కొనసాగుతూ ఉండగా, అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూడాలా అని ఎదురు చూస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ చిత్రాన్ని 2025 మార్చి 28న విడుదల చేయాలని అధికారికంగా ప్రకటించారు.
అయితే, అదే రోజున విడుదలకు సిద్ధమవుతున్న మరో రెండు పెద్ద చిత్రాలు పవన్ కళ్యాణ్ సినిమాకు గట్టి పోటీ ఇవ్వబోతున్నాయి. హిందీలో సల్మాన్ ఖాన్ (Salman Khan) హీరోగా తెరకెక్కుతున్న ‘సికందర్’ (Sikandar) కూడా మార్చి 28న విడుదల కానుంది. ఈ చిత్రానికి మురుగదాస్(A.R. Murugadoss) దర్శకత్వం వహిస్తున్నారు, మరియు రష్మిక మందన్న (Rashmika Mandanna) ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాకుండా, మలయాళంలో మోహన్ లాల్ (Mohanlal) ప్రధాన పాత్రలో నటిస్తున్న సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ సీక్వెల్ ‘L2: ఎంపురన్’ మార్చి 27న విడుదల అవుతోంది.
ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా సినిమా సౌత్ మరియు నార్త్ ప్రేక్షకులలోకి చేరుకోవడం ఒక సవాలుగా మారబోతోందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ఒకవైపు సల్మాన్ ఖాన్ హిందీలో స్ట్రాంగ్ ఫాలోయింగ్ కలిగి ఉండగా, మరోవైపు మోహన్ లాల్ మలయాళంలో భారీ స్థాయి క్రేజ్‌ను కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో ‘హరిహర వీరమల్లు’ చిత్రంపై కలెక్షన్స్ పై ప్రభావం పడవచ్చనే అంచనాలు ఉన్నాయి.
అయితే, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించడం, నేషనల్ వైడ్ గా ఆయనకు గుర్తింపు ఉండడంతో ‘హరిహర వీరమల్లు’ కి అడ్వాంటేజ్ ఇవ్వవచ్చని భావిస్తున్నారు. ఇక ఫ్యాన్స్ మాత్రం తమ హీరో సినిమా విడుదల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.