భ‌లే ఢీల్ సెట్ అయ్యిందే.. ఇక కుమ్మేస్తారా..?

ప్ర‌తిరోజు పండుగ‌తో హిట్ కొట్టి మ‌ళ్ళీ ఫామ్‌లోకి వ‌చ్చిన మెగా మేన‌ళ్ళుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ నుండి రాబోతున్న చిత్రం సోలో బ్ర‌తుకే సో బెటరు. డిసెంబ‌ర్‌లో క్రిస్మ‌స్ కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది ఈ చిత్రం. కొత్త ద‌ర్శ‌కుడు సుబ్బు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ఇస్మార్ట్ బ్యూటీ న‌భా న‌టేష్ హీరోయిన్‌గా న‌టిచింది. త‌మ‌న్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రాన్నిశ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ బ్యానర్ పై ప్ర‌ముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మించారు.

ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే ఈ సినిమా త‌ర్వాత వెంట‌నే మ‌రో సినిమాను లైన్‌లో పెట్టాడు తేజు. ప్ర‌స్తానం ఫేమ్ దేవ క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఈ సినిమాకి భగవాన్, పుల్లారావు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. దేవా క‌ట్టా మ‌రోసారి సోష‌ల్ ఎలిమెంట్స్‌లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మం ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ స్టార్ అయ్యి ఫ‌స్ట్ షెడ్యూల్ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చింద‌ని టాక్.

అయితే ఈ సినిమాకు సంబందించి తాజా అప్‌డేట్ ఏంటంటే.. ఫ‌స్ట్ షెడ్యూల్ అయిపోకుండా మంచి డీల్ కుదిరింద‌ని స‌మ‌చారం. ప్ర‌స్తుతం థియేట‌ర్లు బంద్ అవ‌డంతో ఓటీటీల హావా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. సోలో బ్ర‌తుకే సో బెట‌రు ఫ‌స్ట్ కాపీని జీటీవీ కొన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో తేజు మ‌రో సినిమాను కూడా జీటీవీ వారు 35 కోట్లకు వరల్డ్ రైట్స్ కొనుగోలు చేశార‌ని టాక్ వినిపిస్తుంది. ఈ క్ర‌మంలో నిర్మాణంలో ఉండ‌గానే అమ్ముడుపోవ‌డంతో ఈ సినిమాకి ఫండింగ్ ప్రాబ్ల‌మ్ ఉండ‌దు. దీంతో తేజు జాక్‌పాట్ కొట్టాడ‌ని మేక‌ర్స్‌కు మాత్రం భ‌లే డీల్ సెట్ అయ్యింద‌ని సినీవ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus