పాపం.. నితిన్ కు ఈ ఏడాది కలిసొస్తుందిలే అనుకుంటే.. పెద్ద బిస్కెట్ అయ్యింది. ‘లై’ ‘ఛల్ మోహన్ రంగ’ ‘శ్రీనివాస కళ్యాణం’ వంటి చిత్రాలతో డిజాస్టర్లను మూటకట్టుకున్న నితిన్.. 2019 మొత్తం ఒక్క సినిమాని కూడా విడుదల చెయ్యలేదు. మొత్తానికి ఈ ఏడాది ‘భీష్మ’ తో సూపర్ హిట్ కొట్టి.. ఊపిరి పీల్చుకున్నాడు. అంతే కాదు.. తన లవర్ షాలినీ రెడ్డిని పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నాడు. ఏప్రిల్ 21న దుబాయ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ ను ప్లాన్ చేసుకున్నాడు.
కానీ వైరస్ మహమ్మారి కారణంగా ఆ ప్లాన్ ఫెయిల్ అయ్యింది. అంతేకాదు గతేడాది ఒక్క సినిమా కూడా విడుదల చెయ్యలేదు కాబట్టి.. ఈ ఏడాది నాలుగు సినిమాలను ప్లాన్ చేసాడు. వెంకీ అట్లూరి డైరెక్షన్లో చెయ్యబోతున్న ‘రంగ్ దే’ తో పాటు చంద్ర శేఖర్ యేలేటి డైరెక్షన్లో ‘చెక్’… అలాగే మేర్లపాక గాంధీ డైరెక్షన్లో ‘అందాదున్’ రీమేక్, ఇక కృష్ణ చైతన్య డైరెక్షన్లో ‘పవర్ పేట’ చిత్రాలను లైన్ లో పెట్టాడు. ఇప్పుడు ఈ చిత్రాల షూటింగ్ లు అన్నీ ఆగిపోయాయి.
నిర్మాతలు నెల నెల వడ్డీలు కడుతూ వస్తున్నారట.షూటింగ్ లు ఎప్పుడు మొదలవుతాయో తెలియని పరిస్థితి. ఒకవేళ మళ్ళీ మొదలైనా.. అన్ని సినిమాల షూటింగ్ లు ఒకేసారి చెయ్యాలంటే చాలా ఇబ్బందే. అంతేకాదు నితిన్ పారితోషికం కూడా తగ్గించుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఈ రకంగా చూస్తే.. 4 సినిమాలు ఓకే చేసి నితిన్ తప్పు చేసాడు అనే సందేహం రాక మానదు.