మోహన్ లాల్ (Mohanlal) సినిమాలకి తెలుగులో కూడా డీసెంట్ మార్కెట్ ఏర్పడింది. గతంలో మోహన్ లాల్ నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో డబ్ అయినప్పటికీ… ‘మనమంతా’ అనే స్ట్రైట్ మూవీతో మరింత దగ్గరయ్యారు. అది బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడలేదు. అయితే ఆ తర్వాత ‘జనతా గ్యారేజ్’ లో (Janatha Garage) ఎన్టీఆర్ తో కలిసి ఓ ముఖ్య పాత్ర పోషించారు. వాస్తవానికి ఆ సినిమాలో ఎన్టీఆర్ కంటే మోహన్ లాల్ పాత్రకే వెయిటేజీ ఎక్కువగా ఉంటుంది. అది తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది.
మోహన్ లాల్ ను తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకునే రేంజ్లో ‘జనతా గ్యారేజ్’ వర్కౌట్ అయ్యింది. అటు తర్వాత మోహన్ లాల్ నటించిన ‘మన్యం పులి’ తెలుగులో చాలా బాగా ఆడింది. అక్కడి నుండి మోహన్ లాల్ నటించిన సినిమాలు అన్నీ తెలుగులో డబ్ అవుతున్నాయి. కొన్ని సో సోగా ఆడాయి. ఇంకొన్ని ఆడలేదు. ఇదిలా ఉండగా.. మోహన్ లాల్ లేటెస్ట్ మూవీ ‘తుడరుమ్’ గత వారం రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది.
బాక్సాఫీస్ వద్ద మొదటి వీకెండ్ కి రూ.80 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ను బట్టి బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా రూ.150 కోట్లు కలెక్ట్ చేస్తుంది అని అంచనా. అయితే మోహన్ లాల్ గత చిత్రం ‘ఎల్ 2 : ఎంపురాన్’ (L2 Empuraan) రేంజ్లో ఈ సినిమాను ప్రమోట్ చేసింది లేదు. ఆ సినిమాని కేరళ, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో బాగా ప్రమోట్ చేశారు. దీంతో కచ్చితంగా ఈ సినిమా రూ.300 కోట్లు కలెక్ట్ చేస్తుంది అని మేకర్స్ భావించారు.
కానీ మలయాళంలో తప్ప ఆ సినిమా మిగతా భాషల్లో ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అందువల్ల ఆ రేంజ్లో ‘ఎంపురాన్’ కలెక్ట్ చేసింది లేదు. ‘తుడరుమ్’ (Thudarum) సినిమాను కనుక ‘ఎంపురాన్’ రేంజ్లో ప్రమోట్ చేసి ఉంటే కచ్చితంగా ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టేది. ఇప్పుడైతే ఈ సినిమా కేరళలో తప్ప మిగతా భాషల్లో రిలీజ్ అయినట్టు చాలా మందికి తెలీదు. మరి ఇప్పటికైనా తప్పు తెలుసుకుని సక్సెస్ మీట్ వంటివి ఏర్పాటు చేసి పుష్ చేసే ప్రయత్నం మేకర్స్ చేస్తారేమో చూడాలి.