గత 40 రోజుల నుండీ థియేటర్లు రన్ అవుతున్నాయి కానీ.. పూర్వ వైభవం అయితే కనబడటం లేదు. కరోనా భయం జనాల్లో తగ్గలేకో.. వర్షాలు ఎడతెగకుండా కురవడం వల్లనో.. లేక ఓటిటిలకు జనాలు అలవాటు పడిపోవడం వలనో.. అదీ కాదంటే పెద్ద సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలు రిలీజ్ కాకపోవడం వలనో కానీ.. థియేటర్లు కళకళలాడటం లేదు. ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ ‘రాజ రాజ చోర’ వంటి సినిమాలు విజయాన్ని సాధించాయి. అయితే అవి రూ.10 కోట్ల లోపు బిజినెస్ చేసిన సినిమాలే..!
మంచి అంచనాల నడుమ విడుదలైన ‘పాగల్’ ‘శ్రీదేవి సోడా సెంటర్’ వంటి సినిమాలు నిరాశపరిచడంతో మీడియం, పెద్ద సినిమాలు థియేటర్లకు రావడం లేడు. అయితే గోపీచంద్ హీరోగా నటించిన ‘సీటీమార్’ చిత్రం సెప్టెంబర్ 10న వినాయక చవితి కానుకగా రిలీజ్ కాబోతుంది. సంపత్ నంది దీనికి దర్శకుడు. ఈ సినిమాకి రూ.16 థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ పండితుల సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత పెద్ద మొత్తం రాబట్టడం ఈజీ అయితే కాదు. అదే రోజున నాని నటించిన ‘టక్ జగదీష్’ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో రిలీజ్ కాబోతుంది.
దాంతో పాటు ‘నెట్’ అనే థ్రిల్లర్ మూవీ కూడా జీ5 లో రిలీజ్ కాబోతుంది. పైగా ఇంకా ఆంధ్రప్రదేష్ లో 3 షోలే ప్రదర్శింపబడుతున్నాయి. ఒక్క వినాయక చవితి పండుగ హాలిడే అలాగే మాస్ సినిమా అనే బ్రాండ్ ఒక్కటే ‘సీటీమార్’ కు కలిసొచ్చే అంశాలు. వీటితో కనుక ‘సీటీమార్’ చిత్రం ఓ రూ.20 కోట్ల షేర్ ను కలెక్ట్ చేయగలిగి సూపర్ హిట్ గా నిలిస్తే.. వరుసగా మీడియం రేంజ్ సినిమాలు రిలీజ్ కావడం ఖాయం అని చెప్పొచ్చు.
Most Recommended Video
బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!