రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) , మారుతి (Maruthi Dasari) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న రాజాసాబ్ (The Raja saab) సినిమా గురించి ఆసక్తికరమైన అప్‌డేట్స్ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం, ప్రభాస్ కెరీర్‌లో మరింత డిఫరెంట్ అటెంప్ట్ గా నిలవనుంది. సినిమా థ్రిల్లర్ జోనర్‌లో సాగుతుందని, థమన్ (S.S.Thaman) మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని టాక్. ఇప్పటికే సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయిందని సమాచారం. క్లైమాక్స్ షూట్ కోసం ప్రత్యేకంగా ఒక గ్రాండ్ రాజ్ మహల్ సెట్ ఏర్పాటు చేశారని తెలుస్తోంది.
The Raja Saab
ఈ మహల్ సెట్‌లోనే హై వోల్టేజ్ సీన్స్ షూట్ చేస్తారని, ఈ ఎపిసోడ్స్ సినిమాకు కీలకంగా మారతాయని చిత్రబృందం చెబుతోంది. సినిమా కాన్సెప్ట్ పూర్తిగా ఓ కొత్త ప్రపంచంలోకి ఆడియన్స్‌ని తీసుకెళ్తుందని తెలుస్తోంది. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ (Nidhhi Agerwal), మాళవిక మోహనన్(Malavika Mohanan) కథానాయికలుగా నటిస్తున్నారు. ఇక సెట్స్ కోసమే భారీగా ఖర్చు చేస్తున్నట్లు టాక్. మారుతి మార్క్ కామెడీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్ కలగలిపి ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తీసుకెళ్లేలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.
బాహుబలి (Baahubali) తర్వాత ప్రభాస్ చేస్తున్న అన్ని సినిమాలు భారీ అంచనాలతో రాగా, రాజాసాబ్ కథాంశం వల్ల ప్రేక్షకుల్ని పూర్తిగా కొత్తగా ఆకట్టుకుంటుందని యూనిట్ విశ్వసిస్తోంది. సినిమాకు సంబంధించిన వి.ఎఫ్.ఎక్స్ వర్క్ ఎక్కువ టైమ్ తీసుకుంటుందని, విడుదల తేదీకి మార్పు ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. మొదట ఈ సినిమాను 2025 ఏప్రిల్ 10 రిలీజ్ చేయాలని భావించినా, విడుదల తేదీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.
అయితే టీజర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే టీజర్ తోనే రిలీజ్ డేట్ పై అసలు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటించడం ఒక్కటే ఈ సినిమాపై భారీ ఆసక్తి క్రియేట్ చేసింది. మారుతి, ప్రభాస్ ఈ సినిమాతో అన్ని వర్గాల ఆడియన్స్‌ని టార్గెట్ చేస్తూ, భారీ సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులకు ట్రీట్ అందించబోతున్నారు.