అల్లు అర్జున్ (Allu Arjun) .. ఈరోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు . ఆయన లీగల్ నోటీసులు అందుకున్న సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ ఘటనపై ఆయన ఈ విచారణలో పాల్గొనాల్సి ఉంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ ను పోలీసులు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? అనే ఆసక్తికర చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం కింది ప్రశ్నలు విచారణలో భాగంగా పోలీసులు అల్లు అర్జున్ ను అడిగే అవకాశం ఉంది అని తెలుస్తుంది. అవేంటంటే :
1. సంధ్య థియేటర్ దగ్గరకి ఎందుకు ర్యాలీగా వెళ్లాల్సి వచ్చింది?
2. సంథ్య థియేటర్‌కు రావొద్దని యాజమాన్యం మీకు ఏమైనా ముందుగా చెప్పడం జరిగిందా?
3. పోలీసుల అనుమతి లేదన్న విషయం మీకు తెలుసా?.. తెలియదా?
4. సంధ్య థియేటర్‌లో ప్రీమియర్ షోకు వస్తున్నట్లు అనుమతి తీసుకున్నారా? దానికి సంబంధించిన కాపీ ఏమైనా మీ వద్ద ఉందా?
5. మీరు లేదా మీ పీఆర్ టీం పోలీసుల అనుమతి తీసుకున్నారా?
6. సంధ్య థియేటర్ వద్ద పరిస్థితిని మీ పీఆర్ టీం ముందే మీకు వివరించిందా?
7. తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది?
8. తొక్కిసలాట జరిగిన విషయాన్ని మీకు ముందుగా ఎవరు చెప్పారు?
9. ఏసీపీ చెప్పినప్పుడు థియేటర్ నుంచి ఎందుకు వెంటనే వెళ్లిపోలేదు?
10. సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే తొక్కిసలాట ఘటన గురించి తెలిసినా మీరెందుకు సినిమా చూశారు?
11. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మీరు ముందే థియేటర్ యాజమాన్యానికి చెప్పడం జరిగిందా?
12. రోడ్ షో కోసం మీరు ఎంతమంది బౌన్సర్లను తీసుకెళ్లారు?
మొత్తంగా ఈ ప్రశ్నలు.. అల్లు అర్జున్ ను అడిగే అవకాశం ఉంది. వీటిపై చర్చలు కూడా పోలీస్ స్టేషన్లో జరిగే అవకాశం ఉంది అని తెలుస్తుంది. మొత్తంగా ఈ ప్రశ్నలకి గాను అల్లు అర్జున్ 6 గంటలు టైం కేటాయించాల్సి ఉందట.