చిన్న హీరోతో పెద్ద సినిమా… ఈ మాట మనం చాలా సార్లు వినుంటాం. అదేంటి అనే డౌట్ మీకు మళ్లీ వస్తే ‘మిరాయ్’ (Mirai) సినిమా గురించి చదవండి మీకే అర్థమైతుంది. ‘హను – మాన్’ (Hanu-Man) తప్పు భారీ సినిమా ఒక్కటీ లేని తేజ సజ్జా (Teja Sajja) మీద నమ్మకంతో ఆ సినిమా చేస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. దర్శకుడు ఏమన్నా బ్లాక్‌బస్టర్‌లు ఇచ్చినవారా అంటే అదీ కాదు. తొలి సినిమా బాగుంది అనిపిస్తే… రెండో సినిమాకు తీవ్ర నిరాశ ఎదురైంది. అయితే ఈ కథ మీద నమ్మకంతో ముందుకొచ్చారు. దీంతో ఏంటా కథ అనే ఆసక్తి మొదలైంది.
‘హను – మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా… ఇప్పుడు సూపర్ యోధుడిగా మారబోతున్నాడు. ఆయన కథానాయకుడిగా కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) దర్శకత్వంలో ‘మిరాయ్’ అనే సినిమా చేస్తారు. మిరాయ్ అంటే భవిష్యత్తు అని చెప్పొచ్చు. సామ్రాట్ అశోక్ చరిత్రలో కళింగ యుద్ధం ఓ మరకగా మిగిలిన విషయం తెలిసిందే. ఆ యుద్ధం తర్వాత పశ్చాత్తాపంలో ఉండగా… ఓ దేవ రహస్యం తెలుస్తుంది. మనిషిని దైవం చేసే తొమ్మిది గ్రంథాల అపార జ్ఞానం అది. తరాలుగా వాటిని కాపాడుతూ తొమ్మిది మంది యోధులు కాపాడుతుంటారు.
అలాంటి జ్ఞానానికి చేరువవుతున్న ఓ గ్రహణం, ఆ గ్రహణాన్ని ఆపే ఓ జననం. ఇది తరాలుగా తప్పని మహారణం ఈ కథ అని సినిమా టీజర్‌లో చెప్పారు. దీని బట్టి కథ మనకు అర్థమవుతుంది. ఇక ఈ సినిమాను తెలుగుతోపాటు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ 18న విడుదల చేస్తారు.
‘మిరాయ్’ అంటే… అశోకుని కాలంలో రహస్యమైన ఓ శాసనం. దీని గురించి సినిమా విడుదల తర్వాత మరింత బాగా అర్థమవుతుంది అని చెప్పారు దర్శకుడు. ‘హను – మాన్’ సినిమాకు ముందే ఈ కథని తేజకి చెప్పారట. ఇక ఈ సినిమాలో మంచు మనోజ్ (Manchu Manoj) ఓ కీలక పాత్రలో నటిస్తారట. ఆయనకు సంబంధించిన లుక్, ఇతర వివరాఉల ఈ నెల 20న తెలుస్తాయి అంటున్నారు. ఆ రోజు ఆయన జన్మదినం అనే సంగతి తెలిసిందే.