Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చింది రవి వల్లేనా..?

బిగ్ బాస్ హౌస్ లో బిబి బొమ్మల ఫ్యాక్టరీ టాస్క్ అనేది చాలా ఉత్కంఠభరితంగా సాగింది. బిగ్ బాస్ పంపించిన ప్రత్యేకమైన బొమ్మలో పవర్ కారణంగా గ్రీన్ టీమ్ ( రవి, శ్వేత, లోబో ) బ్లూ టీమ్ ( మానస్, సన్నీ, అనీమాస్టర్ ) చేసిన బొమ్మలని స్వాదీనం చేసుకుంది. దీంతో గ్రీన్ టీమ్ లీడింగ్ లోకి వచ్చింది. సిరి తను మేనేజర్ గా ఉన్న టీమ్ గెలుస్తోందని తెగ ఆనందపడిపోయింది. ఇక్కడే కాజల్ ట్విస్ట్ ఇచ్చింది నేను ఓకే చేసిన బొమ్మలని ఫైనల్ గా మరోసారి చెక్ చేస్తానంటూ కండీషన్ పెట్టింది. దీనికి సిరి ఒప్పుకోలేదు. ఈ ఆర్గ్యూమెంట్ తో చాలాసేపు ఫైనల్ కౌంటింగ్ బిగ్ బాస్ కి చెప్పలేదు.

ఇక బిగ్ బాస్ ప్రోమోలో చూపించిన విధంగా షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. గ్రీన్ టీమ్ అయిన రవి , శ్వేత, లోబోల్లో శ్వేత ఇంకా లోబో ఇద్దరూ కూడా ఇంట్లోని ప్రోపర్టీ అయిన కుషన్స్ లో కాటన్ ని బొమ్మల్లో వాడారని చెప్పాడు. బిగ్ బాస్ హౌస్ లో అతి ముఖ్యమైన నియమాన్ని అతిక్రమించారని అందుకు ఆ టీమ్ ని డిస్ క్వాలిఫై చేస్తున్నామని చెప్పాడు. అంతేకాదు, ఇదేమీ పట్టించుకోకుండా సంచాలకులు వారి పని వాళ్లు చూసుకున్నారని, సంచాలకులుగా వాళ్ల విధిని నిర్వర్తించడంలో విఫలం అయ్యారని సిరిని, ఇంకా కాజల్ ని కూడా డిస్ క్వాలిఫై చేశాడు బిగ్ బాస్. దీంతో హౌస్ మేట్స్ కి ఒక్కసారిగా దిమ్మతిరిగిపోయింది.

కేవలం గ్రీన్ టీమ్ ని మాత్రమే కాకుండా మేనేజర్స్ అయిన ఇద్దరినీ కూడా డిస్ క్వాలిఫై చేయడంతో రవి అండ్ టీమ్ బాధపడింది. దీనికి రవి సారీ కూడా చెప్పాడు. కానీ, గ్రీన్ టీమ్ లో శ్వేతకి – లోబోకి ఈ ఐడియా ఇచ్చింది రవినే అని శ్వేత చెప్పింది. అందుకే రవి సారీ చెప్పాడు. ఇంతలా బిగ్ బాస్ ట్విస్ట్ ఇవ్వడానికి కారణం రవినే. రాజు టాస్క్ లో చాలాబాగా జెన్యూన్ గా ఆడిన రవి మరి ఈ టాస్క్ లో ఎందుకు ఇలా ఆడాడు అనేది పాయింట్. అదీ మేటర్.

[yop_poll id=”3″]

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus