రజనీకాంత్ సినిమా అంటే తమిళ ప్రేక్షకులకి మాత్రమే కాదు.. తెలుగు ప్రేక్షకులకు కూడా విపరీతమైన ఆసక్తి నెలకొంటుంది అనడంలో సందేహం లేదు. అయితే ఆయన సినిమాకి సంబందించి ఎక్కువగా లీక్ లు జరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అది ఈ మధ్య మొదలైంది కాదు ఎప్పటినుండో.. ఇదే తంతు జరుగుతుంది. సినిమా షూటింగ్ జరిగే సమయంలో ఆయన్ని చూడడానికి విపరీతంగా జనం తరలిరావడం.. అక్కడ అతి ఉత్సాహం కలిగిన వారు ఫోన్లు తీసుకుని వీడియోలు లేదా ఫోటోలు తీసి నెట్ లో అప్లోడ్ చేసేస్తుంటారు. ఇక సినిమాల విషయంలో కూడా అంతేనేమో. రజినీ సినిమా అని ఎక్కువ థియేటర్లలో విడుదల చేస్తుంటారు.
జనాలు సినిమాలు ఎక్కువ చూడని ప్రదేశాల్లో.. సినిమాకి వెళ్ళి అక్కడ సినిమాని మొత్తం రికార్డు చేసేస్తుంటారనుకుంట. అందుకే రజనీ సినిమాలు రిలీజ్ అయిన 24 గంటల్లోనే నెట్లో దర్శనమిస్తుంటుంది. ఇప్పుడు ‘దర్బార్’ చిత్రం విషయంలో కూడా అదే జరిగింది. జనవరి 9న(నిన్న) విడుదలైన ఈ చిత్రం కూడా 24 గంటలు కూడా తిరగకుండానే ప్రముఖ పైరసీ వెబ్ సైట్లో దర్శనమిచ్చింది. సినిమాని చూడటమే కాదు డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చేసారు. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తెగ టెన్షన్ పడుతున్నారు.