దిల్ రాజు టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్. ఈయన జడ్జిమెంట్ పై అటు ఇండస్ట్రీ పెద్దల్లోనూ ఇటు డిస్ట్రిబ్యూటర్లలోనూ మంచి నమ్మకం ఉంటుంది. చిన్న సినిమాలతోనే సెన్సేషన్ క్రియేట్ చేశారు ఈయన. ఇక పెద్ద సినిమాలకు ఈయన తీసుకునే కేరింగ్ మరో నిర్మాత తీసుకుంటాడా? అనే విధంగా కూడా ఉంటుంది ఈయన పనితనం. అయితే బాలీవుడ్ లో కూడా సత్తా చాటాలనే ఉద్దేశంతో ఇక్కడ హిట్ అయిన కొన్ని సినిమాలను అక్కడ రీమేక్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు.
మూడు సినిమాలను లైన్లో పెట్టారు. మొదటిది… జెర్సీ కాగా ‘హిట్’ ‘నాంది’ కూడా ఉన్నాయి.’ఎఫ్2′ ని కూడా ప్లాన్ చేశారు. అయితే తాజాగా షాహిద్ కపూర్ హీరోగా వచ్చిన ‘జెర్సీ’ ఈ శుక్రవారం నాడు విడుదలైంది.నిజానికి గత వారమే ఈ మూవీ రిలీజ్ కావాలి కానీ ‘కె.జి.ఎఫ్2’ వల్ల వాయిదా వేశారు. సినిమాకి మంచి టాక్ వచ్చింది కానీ వసూళ్లు మాత్రం ఘోరంగా నమోదయ్యాయి. ఇక ఈ మూవీ వడ్డుకు చేరడం కష్టమని ట్రేడ్ పండితులు తేల్చేశారు.
దీంతో మొదటి సినిమాతోనే దిల్ రాజుకి బ్యాడ్ వెల్కమ్ దక్కినట్టు అయ్యింది. షాహిద్ కపూర్ చిన్న హీరో ఏమీ కాదు అతనితో అర్జున్ రెడ్డి రీమేక్ చేస్తే రూ.300 కోట్లు పైనే నెట్ కలెక్ట్ చేసింది.దాని వల్లనే అతనితో ‘జెర్సీ’ రీమేక్ చేశారు. సినిమా చూస్తున్నంత సేపు షాహిద్ మంచి ఛాయిస్ అనిపించాడు, దర్శకుడు గౌతమ్ కూడా బాగానే తీసాడు.ఫలితం తేడా కొట్టడానికి రీజన్ ‘కె.జి.ఎఫ్2’. హిందీలో దీని ఊపు ఇంకా తగ్గలేదు.
ఇలాంటి టైములో ‘జెర్సీ’ ని విడుదల చేయడం బ్యాడ్ ప్లానింగ్ అనాలి. దిల్ రాజు దీని తర్వాత రాజ్ కుమార్ రావు హీరోగా ‘హిట్’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు.నిజానికి ఇలాంటి సినిమాలకి హిందీలో డిమాండ్ తగ్గిపోయింది. అక్కడి హీరోలు ఇలాంటివే చేస్తున్నారు. యాక్షన్ కథలు, మాస్ కథలకే హిందీ జనాలు ఓటేస్తున్నారు. దిల్ రాజు కూడా అదే విధంగా అలోచించి డిసైడ్ అయితే మంచిది.