అంత ఎక్కువ ఆశించకండి మహేష్ ఫ్యాన్సూ..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుసగా ‘భరత్ అనే నేను’ ‘మహర్షి’ ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి హిట్లతో సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఈ క్రమంలో తన తరువాతి చిత్రాన్ని ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్(బుజ్జి) తో చెయ్యబోతున్నట్టు కూడా ప్రకటించాడు. ‘సర్కారు వారి పాట’ అనే పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతోందని కృష్ణ పుట్టినరోజు అయిన మే31న అధికారికంగా ప్రకటించారు. ‘మైత్రి మూవీ మేకర్స్’ ’14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్’ సంస్థలు కలిసి నిర్మిస్తుండగా..

‘జి.ఎం.బి. ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై మహేష్ కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఆగష్ట్ 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘సర్కారు వారి పాట’ చిత్రం నుండీ టైటిల్ ట్రాక్ విడుదల కాబోతుంది అంటూ ప్రచారం జరిగింది. దర్శకుడు పరశురామ్(బుజ్జి) ట్విట్టర్ అకౌంట్ నుండీ ఈ ప్రకటన వచ్చినట్టు మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హడావిడి మొదలుపెట్టారు. అయితే అదంతా ఫేక్ న్యూస్ అని.. పరశురామ్(బుజ్జి) ఫేక్ అకౌంట్ నుండీ ఆ వార్త బయటకు వచ్చినట్టు సమాచారం.

కానీ మహేష్ పుట్టినరోజు నాడు మాత్రం కచ్చితంగా ‘సర్కారు వారి పాట’ టీం నుండీ ఓ సర్ ప్రైజ్ అయితే ఉంటుందని… అందులో ఎలాంటి సందేహం లేదనేది ఇన్సైడ్ టాక్. ఇక ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

Most Recommended Video

ఎక్కువ రోజులు థియేటర్స్ లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్!
విడుదల కాకుండానే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఎవేవంటే..?
ఈ బుల్లితెర నటీమణుల పారితోషికాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus